'ఆరెంజ్' అని టైటిల్ పెట్టడానికి కారణం అదే..నాగబాబు
"ఆరెంజ్" అనేది ఒక పర్పస్ లాగ ఉంటుంది. ఆరెంజ్ అనేది ఒక రంగు. ఆరెంజ్ అనేది ఒక ప్రెష్ నెస్ తో కూడుకున్నది. ఒక్కో ఎమోషన్ కి ఒక్కో రంగు ఉంటుంది. ఉదాహరణకు శాంతికి తెలుపు, విప్లవానికి ఎరుపు ఎలాగో అలాగే ఓ ప్రేమగాఢతను ఆరెంజ్ రంగు ప్రతిబింబిస్తుంది. అలా కాకుండా ఆరెంజ్ లోని తీపి, పులుపు, ఇవి కూడా అన్వయించుకోవచ్చు. ఆ కోణంలోనే ఈ టైటిల్ పెట్టాం అని నిర్మాత నాగబాబు అన్నారు.
రామ్ చరణ్ తేజ్, జెనీలియా కాంబినేషన్ లో భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.
అలాగే...ఆరెంజ్ టైటిల్ గురించి ఆయన విశ్లేషిస్తూ మొదట వర్కింగ్ టైటిల్‌గానే అనుకున్నాం. అయితే అందరికీ బాగా నచ్చేయడంతో ఇదే ఉంచేశాం అన్నారు. మగధీర ఓ మేజిక్ అయితే, ఆరెంజ్ ఓ ఎక్స్‌పీరియెన్స్ అనాలి. ఖుషీ తరహాలో హాయిగా, రొమాంటిగ్గా సాగే సినిమా ఇది. చరణ్ కి, భాస్కర్ కి ఇది మూడో చిత్రం. కచ్చితంగా ఇద్దరూ ఆరెంజ్ తో హేట్రిక్ పూర్తి చేస్తారు అని నాగబాబు చెప్పారు.


Click it and Unblock the Notifications











