LEO వివాదంలో లియో.. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌పై స్టే.. నిర్మాత నాగవంశీ క్లారిటీ

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ నటించిన లియో చిత్రం తెలుగు వెర్షన్ విడుదల వివాదంలో చిక్కుకొన్నట్టు కనిపించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ను వాయిదా వేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్టే రావడంతో ఈ చిత్రం విడుదలవుతుందా? అనే విషయంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. దాంతో నిర్మాత నాగవంశీ అత్యవసరంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి లియో సినిమాపై క్లారిటీ ఇచ్చారు. నాగవంశీ చెప్పిన వివరాలకు సంధించిన విషయాల్లోకి వెళితే..

లియో సినిమా టైటిల్ నాదే అంటూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజులుగా మీడియాలో ప్రకటన చేశారు. అయితే సినిమా టైటిల్‌పై విజయ్ మూవీ యూనిట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో లాయర్ నర్సింహారెడ్డి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. సినిమా విడుదల నిలిపివేయాలంటూ కోర్టు ఉత్త్వరులు జారీ చేసింది. దాంతో సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనేది చర్చనీయాంవమైంది.

Producer Nagavamshi clarity on Vijays Leo title and Telugu Version Release controversy

దాంతో లియో సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న నాగవంశీ స్పందించారు. ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొన్నాం. లియో టైటిల్‌ను విజయవాడలో రిజిస్టర్ చేశారు. ఆ విషయం మా దృష్టికి రాలేదు. మా మధ్య కమ్యునికేషన్‌లో గ్యాప్ రావడంతో గందరగోళం నెలకొన్నది. లియో టైటిల్ నాదే అంటున్న ఫిర్యాదు దారుడితో చర్చలు జరిపి వివాదాన్ని పరిష్కరించుకొన్నాం. టైటిల్ రిజిస్టర్ చేసుకొన్న వ్యక్తి నష్టపోవద్దు.. అలాగే మేము రిలీజ్ చేయకుండా ఆపలేం. అందుకే సామరస్యంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకొన్నాం. ఈ సినిమా అనుకొన్న ప్లాన్ ప్రకారమే అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అవుతున్నది అని నాగవంశీ చెప్పారు.

విజయ్‌తో సినిమా చేయాలనే ఉద్దేశంతో లియో సినిమా హక్కులను తీసుకోలేదు. భవిష్కత్‌లో విజయ్‌తో మూవీ చేస్తాం. లియో హిట్ అవుతుందని మొదటి నుంచి నాకు గట్ ఫీలింగ్ ఉంది. అందుకే ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులు తీసుకొన్నాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్‌కి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిరాశ పరచడని అనుకొంటున్నాం అని నాగవంశీ చెప్పారు.

Producer Nagavamshi Responds On Leo Telugu Version Release

భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో కూడా రిలీజ్ అవుతున్న సందర్భంగా థియేటర్ల విషయంలో ఎలాంటి సమస్య లేదు. ఇప్పటికే మ్యాడ్ సినిమా ప్రెస్ మీట్‌లో చెప్పాను. బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి కోసం థియేటర్ల కేటాయింపు జరిగిపోయింది. అలాగే రవితేజ సినిమాకు కావాల్సిన థియేటర్లు దొరికాయి. అలాగే లియోకు కావాల్సిన థియేటర్లు కూడా లభించాయి. తెలుగు సినిమాలు భారీ విజయాలు సాధించాలని కోరుకొంటున్నాను అని నాగవంశీ చెప్పారు.

తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చి.. డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యత తగ్గించాలనే విషయంపై గతంలో ఫిల్మ్ చాంబర్ చొరవ తీసుకొన్నది నిజమే. కానీ కోవిడ్ తర్వాత సినిమాల రిలీజ్ విషయంలో పరిస్థితి మారింది. భాషాబేధం లేకుండా అన్ని భాషల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. లియో తెలుగు మూవీ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నది. తెలుగు సినిమాల కంటే లియో అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో మీకు అడ్వాన్స్ బుకింగ్ చూస్తే తెలుస్తుంది అని నాగవంశీ అన్నారు.

లియో సినిమా విషయానికి వస్తే.. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో త్రిషా కృష్ణన్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్, బాబు ఆంతోని, మనోబాలా, జార్జ్ మార్యన్ తదితరులు నటించారు. ఈ సినిమా నడివి 2 గంటల 44 నిమిషాలు ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X