twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న 'వాడు' అంటూ కామెంట్స్.. దెబ్బకు సారీ చెప్పిన నాగవంశీ.. బాధపడ్డా అంటూ నోట్!

    |

    సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎన్నో హిట్టు సినిమాలను నిర్మించిన నాగవంశీ ఈ మధ్య దాకా మీడియాలో పెద్దగా కనిపించేవారు కాదు కానీ ఎందుకో మధ్యనే ఎక్కువగా మీడియా ఎక్స్ పోజర్ ఎక్కువైంది. తాజాగా ఆయన అలా మీడియాతో ముచ్చటిస్తూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ నోట్ రిలేజ్ చేశారు. ఆ వివరాలు

    డీజే టిల్లు సినిమాతో

    డీజే టిల్లు సినిమాతో

    సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డీజే టిల్లు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మించగా డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సిద్ధూ జొన్నలగడ్డ కధ అందించడమే కాక స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఇక ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు.

     విజ‌య‌యాత్రలో భాగంగా

    విజ‌య‌యాత్రలో భాగంగా

    రీసెంట్ గా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు విడుదలయిన అన్ని కేంద్రాలలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. జాతి రత్నాలు తరువాత ఆ స్థాయి వినోదాత్మక చిత్రంగా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్న డిజె టిల్లు టీమ్ విజ‌య‌యాత్రలో భాగంగా అన్ని ప్రదేశాలు తిరుగుతోంది.

    వాడు-వీడు అంటూ

    వాడు-వీడు అంటూ


    అందులో భాగంగానే విశాఖలో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఆ మీట్ అనంతరం మీడియాతో ముచ్చటించిన క్రమంలో నాగవంశీకి కలెక్షన్స్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆడియన్స్ లెక్కలు చూస్తారు అన్నట్టు ఒక ప్రశ్న వేశారు ఒక రిపోర్టర్. ఈ క్రమంలో నాగవంశీ స్పందిస్తూ.. 'ఈ లెక్కలన్నీ మనలాంటి మేధావులకు కావాలి కానీ ఆడియన్ గా వాడిచ్చే 150రూపాయలకు వాడు నవ్వుకున్నాడా? లేడా అనేది సరిపోతుంది. వాడిచ్చే 150 రూపాయలకు 1500 విలువ నవ్వించాం. అదే చాలు వాడికి. వాడు హ్యాపీ` అని కామెంట్స్ చేశారు.

    క్షమాపణలు కోరిన వంశీ

    అయితే ఇక్కడే అసలు వివాదం మొదలయింది. ఆడియన్స్ ను వాడు, వీడు అని సంబోధిస్తూ మాట్లాడడం చాలా మందికి నచ్చలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా నాగవంశీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మాములుగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నాగవంశీ ఎందుకొచ్చిన గొడవ ఏమనుకున్నారో? ఏమో కానీ ఆడియన్స్ ను క్షమాపణలు కోరారు నాగవంశీ.

    Recommended Video

    DJ Tillu Sequel ? /Sidhu Jonnalagadda Clarifies | Neha Shetty | Filmibeat Telugu
    సోదరులుగా భావించటం వల్లే

    సోదరులుగా భావించటం వల్లే

    ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ''ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థ కైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో 'డిజె టిల్లు' విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను. ప్రేక్షకులను ఏకవచనం తో సంబోధిస్తూ మాట్లాడటం, వారిని నా సోదరులుగా భావించటం వల్లే. అయినా వారి మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం, వారే మా బలం'' అంటూ ట్విట్టర్ లో క్షమాపణ నోట్ షేర్ చేశారు.

    English summary
    Producer Naga Vamsi apologizes to the audience, over loose comments in DJ Tillu success meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X