twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమ్మవాళ్లకే నంది అవార్డులు.. కడుపు మండుతోంది.. సీ కల్యాణ్‌కు బుజ్జి వార్నింగ్

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

    By Rajababu
    |

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అవార్డుల్లో అన్యాయం జరిగిందని కడుపు మండుతున్న నిర్మాతలు అందరూ బయటకు వచ్చి జ్యూరీ, ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. తాజాగా అవార్డుల్లో తమకు న్యాయం జరుగలేదంటూ బుధవారం నిర్మాత నల్లమల్లపు బుజ్జి, దర్శకుడు గుణశేఖర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీ కల్యాణ్‌కు నల్లమల్లపు బుజ్జి వార్నింగ్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..

    Recommended Video

    నంది అవార్డులు కాదు.. సైకిల్ అవార్డులు..!
     రేసుగుర్రం అవార్డు ఇవ్వరా?

    రేసుగుర్రం అవార్డు ఇవ్వరా?

    2014లో మేము తీసిన రేసుగుర్రం చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొంది సంచలన విజయం సాధించింది. అలాంటి సినిమాను పక్కన పెట్టి ఏవో సినిమాలకు అవార్డులు ఇచ్చారు. సైమా, ఫిలింఫేర్ ఇతర అవార్డు కార్యక్రమాల్లో రేసుగుర్రం చిత్రానికి అవార్డులు వచ్చాయి. నంది అవార్డులో మాకు అవార్డు రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

     వన్‌సైడ్‌గా అవార్డులు పంచుకొన్నారు..

    వన్‌సైడ్‌గా అవార్డులు పంచుకొన్నారు..

    తాజాగా ప్రకటించిన నంది అవార్డుల ప్రకటన చూస్తే ప్రభుత్వం, జ్యూరీ వన్‌సైడ్‌గా అవార్డులు ఇచ్చుకొన్నారు. నంది అవార్డులపై రోడ్లు ఎక్కవద్దని కామెంట్ చేసిన నిర్మాత సీ కల్యాణ్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఓ సక్సెస్ ఇచ్చి మాట్లాడాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    రేసుగుర్రానికి అర్హత లేదా

    రేసుగుర్రానికి అర్హత లేదా

    రేసుగుర్రం చిత్రం 100 కోట్లు వసూలు చేసింది. నా కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. అలాంటి సినిమాలో కనీసం హీరోయిన్‌కైనా ఓ అవార్డు ఇవ్వాలి గదా. ఆ చిత్రానికి అర్హత లేదా? అవార్డులు పంచుకున్నట్టు కనిపిస్తున్నది.

     ప్రభుత్వం గుర్తించలేదు

    ప్రభుత్వం గుర్తించలేదు

    అవార్డులను ఎందుకు కోరుకొంటాం. మేము తీసిన చిత్రాన్ని ప్రభుత్వం కూడా గుర్తిస్తే బాగుంటుంది అని అనుకొంటాం. ఏపీ ప్రభుత్వం, జ్యూరీ ఓ సారి ఆలోచించుకోవాలి. ఎన్నడూ మీడియాకు ఎక్కని తాము ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే అవార్డుల పంచుకున్న తీరుపై కడుపు మండుతున్నది.

    కంటితుడుపు అవార్డు అది

    కంటితుడుపు అవార్డు అది

    రేసుగుర్రంలో కమెడియన్‌కు కంటితుడుపుగా అవార్డు ఇచ్చారు. అల్లు అర్జున్ మా హీరో. ఆ చిత్రంలో కమెడియన్ రాగానే సినిమా మారిపోతుందా. నా హీరో, నా సినిమాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. అంతేగానీ మరోకరిపై ఆరోపణలు చేయడానికి కాదు.

     అన్ని దొంగ అవార్డులే

    అన్ని దొంగ అవార్డులే

    నంది అవార్డుల కోసం రోడ్లు ఎక్కవద్దు అని సీ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఓ హిట్ సినిమా తీస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అవన్నీ దొంగ అవార్డులే. కమ్మ లాబీయింగ్ స్పష్టంగా కనిపిస్తున్నది.

     ప్రభాస్‌, రుద్రమదేవికి ఎందుకు ఇవ్వలేదు

    ప్రభాస్‌, రుద్రమదేవికి ఎందుకు ఇవ్వలేదు

    బాహుబలి చిత్రానికి ప్రభాస్‌కు ఎందుకు ఇవ్వలేదు. తరతరాలు గుర్తుపెట్టుకొని రుద్రమదేవికి ఎందుకు ఇవ్వలేదు. కానీ బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణికి మాత్రం ఇచ్చుకొంటారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు కాబట్టే మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం.

    English summary
    Allu Arjun's Race Gurram producer Nallamalupu Bujji fired on AP Government and Jury of Nandi Awards. He said lot injustice to Race Gurram movie which he produced. Nandi Awards distributed and given to Kamma caste only. Nandi selection absolutely fake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X