సినీ నిర్మాత భార్య, పిల్లలు అదృశ్యం

నందకిషోర్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..మార్చి 23 తేది నుంచి అతని భార్య, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని తెలుస్తోంది. దాదాపు వారం రోజుల నుంచి భార్య పిల్లలు కనిపించక పోయినా నందకిషోర్ ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. నీరజ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎక్కడికైనా వెళ్లిందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నందకిషోర్ బంధువులతో పాటు, ఆయన నివాసం ఉంటున్న ఇరుగు పొరుగు వారి వద్ద నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


Click it and Unblock the Notifications