పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్‌ను అదుపులో పెట్టుకోవాలి.. పోసాని మాటలు జారడం తప్పే.. నట్టి కుమార్

తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న టికెట్స్ రేట్ల వ్యవహారం, థియేటర్ల ఓపెనింగ్ లాంటి సమస్యలే కాకుండా ఇటీవల పవన్ కల్యాణ్, పోసాని కృష్ణ మురళీ మధ్య చోటుచేసుకొన్న వివాదాలపై చిన్న నిర్మాత సంఘం ప్రతినిధి నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి హైదరాబాద్‌లోని ఇంటిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ సమయంలో పోసాని ఉంటే చంపేసేవారని, అందుకే అలా దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, వారిపై హత్యా ప్రయత్నం కేసులు పెట్టాలని నట్టికుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, పోసాని ఫ్యామిలీ స్ ను మాట్లాడటం కూడా తప్పే. ఎవరు ఎలాంటి గొడవలు పడ్డా...తిట్టుకున్నా అందులోకి ఫ్యామిలీస్‌ను లాగడం, వారిని తిట్టడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. అలాగే తమ నాయకుడికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై దాడులు చేయడమనేది హేయమైన చర్య అని నట్టి కుమార్ అన్నారు.

Producer Natti Kumar about Pawan Kalyan fans and Posani Krishna Murali

పవన్ తన ఫాన్స్‌ను అదుపులో పెట్టుకుని, వారికి దిశానిర్దేశం చేయాలి. ఎట్టి పరిస్థితులలో చిత్ర పరిశ్రమలో అందరం అన్నదమ్ములుగా ఉంటాం. ప్రాణాలు తీసేవాళ్లు, ప్రాణాలకు తెగించేవాళ్లు ఫాన్స్ కాదు. నిజమైన ఫాన్స్ అంటే ఇతరులకు ప్రాణాలు పోసేవాళ్లు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్లు. తమ అభిమాన స్టార్ లకు మరింత పేరుతెచ్చేవిధంగా ప్రవర్థించేవాళ్లు . ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాదాలలో తెలంగాణ గడ్డకు సంబంధంలేదు అని నట్టి కుమార్ క్లారిటీ ఇచ్చారు.

అయితే జనసేన తెలంగాణ ఇంచార్జ్ మాట్లాడుతూ పోసానిని చంపేస్తామంటూ బెదిరించినందువల్ల అతనిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. రేపు ఓటు వేయకపోతే కూడా చంపేస్తామంటారేమో. ఇదంతా తెలంగాణ గడ్డపై జరుగుతున్నందువల్ల ఆంధ్రా వాళ్లు భయం గుప్పెట్లో ఉండాల్సివస్తోంది. వీటిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి అని నట్టి కుమార్ సూచించారు.

చిరంజీవి గారు కూడా సీరియస్ గా తీసుకుని ఇలాంటి దాడులు జరగకుండా చూడాలి ఇది చిలికి చిలికి గాలి వానగా మారకముందే ఇలాంటి వివాదాలకు ఫుల్ స్టాఫ్ పడేవిధంగా చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, జీవిత రాజశేఖర్ గారు, విష్ణు తదితరులు చర్యలు తీసుకోవాలి. ఈ దాడులను వారంతా ఖండించాలి. ఆన్ లైన్ టికెట్ విధానం మంచిదే. పారదర్శకత ఉంటుంది. కానీ దాని నిర్వహణలో అందరికి ఎలా అయితే బావుంటుందో అధ్యనం తర్వాత ప్రభుత్వం ప్రవేశ పెడితే బావుంటుంది.అని నట్టికుమార్ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X