twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రోజు ఫిల్మ్ చాంబర్లో పవన్ కళ్యాణ్ ఏం చేశారో వెల్లడించిన నట్టి!

    By Bojja Kumar
    |

    తన తల్లిని తిట్టించిన సంఘటనపై, దాని వెనక ఉన్న వ్యక్తులు, రాజకీయ శక్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చి ఆగ్రహంతో ఊగిపోయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితరులు కూడా రావడంతో మీడియా ఫోకస్ అంతా ఆ రోజు ఫిల్మ్ ఛాంబర్ వైపే ఉంది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టకుండానే వెళ్లి పోవడంతో అసలు అక్కడ ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ వచ్చి ఆరోజు ఏం చేశారు అనేది హాట్ టాపిక్ అయింది. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఛాంబర్లో ఏం చేశారు అనే విషయం తాజాగా నట్టి కుమార్ బయట పెట్టారు.

    నేను ఆ రోజె రాలేక పోయాను

    నేను ఆ రోజె రాలేక పోయాను

    పవన్ కళ్యాణ్ గారు ఛాంబర్‌కు వచ్చారు. రమ్మని నాకు కూడా కబురు పెట్టారు. అప్పుడు అర్జెంట్ పని మీద గోవా వెళుతున్నాను రాలేను అని చెప్పాను.... అని నట్టి కుమార్ వెల్లడించారు.

    Recommended Video

    Madhavi Latha Posts A Video About pawan Kalyan & Media
    అది ఛాంబర్ మీటింగ్ కాదని బయటకు పంపారు

    అది ఛాంబర్ మీటింగ్ కాదని బయటకు పంపారు

    అన్నపూర్ణ స్టూడియోలో మీటింగ్ జరిగితే కొందరు ఛాంబర్ సభ్యులు వెళ్లారు. అయితే ఈ మీటింగ్ ఛాంబర్ మీటింగ్ కాదని చెబుతూ.... అక్కడికి వెళ్లిన చాంబర్ క్యాషియర్, సెక్టర్ చైర్మన్, ఇంకా ముగ్గురు సభ్యులను అందరినీ బయటకు పంపించేశారు. ఈ మీటింగ్ మాది అని బయటకు పంపించేశారు. మీద అంటే ఏమిటి? ఈ ఇండస్ట్రీ మీ సొంతమా? 20 మందితో ఇండస్ట్రీ కాదు కదా? లక్షల మంది ఉన్నారని నట్టి కుమార్ అన్నారు.

     తప్పు మీ వైపే ఉంది

    తప్పు మీ వైపే ఉంది

    శ్రీరెడ్డి విషయంలో ఛాంబర్ వారు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వలేదు. ఎందుకంటే మీ దాంట్లో తప్పు ఉంది కాబట్టే....ఆ అమ్మాయితో పవన్ కళ్యాణ్‌ను తిట్టించింది మీదాంట్లో ఓ వర్గమే అని నట్టి కుమార్ ఆరోపించారు.

    ఇండస్ట్రీలో ఒకటే కులం

    ఇండస్ట్రీలో ఒకటే కులం

    మీరు కాపు వైపు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్‌కు సపోర్టుగా మాట్లాడుతున్నారా? అనే ప్రశ్నకు నట్టి కుమార్ స్పందిస్తూ.... నేను కాపు అయినా, కమ్మ అయినా సినిమా ఫీల్లులో ఒకటే కులం అని నట్టి తెలిపారు.

    అన్ని వర్గాలకు చెందిన వాడే పవన్ కళ్యాణ్

    అన్ని వర్గాలకు చెందిన వాడే పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్స్ వలన ఇండస్ట్రీ సామాజిక వర్గాలుగా విడిపోయిందనే వాదనపై నట్టి కుమార్ స్పందించారు. 2009లో ఇలానే ప్రజారాజ్యం పార్టీ విషయంలో చిరంజీవి కాపు అని పబ్లిసిటీ చేసి మిగిలిన వారికి దూరం చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెబుతున్నారు. ఒక కులానికి చెందిన వాడు పవన్ కళ్యాణ్ కాదు. అన్ని కులాలు, అన్ని వర్గాలకు చెందిన వాడే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్‌ను నేను వెనకేసుకు రావడం లేదు. పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే తప్ప... ఆయన పార్టీలో నేను లేను. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని నట్టి కుమార్ తెలిపారు.

    అంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారు

    అంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారు

    6వ తేదీ సాయంత్రం శ్రీరెడ్డి ఇష్యూ జరిగింది. 7వ తేదీ ఉదయం 11 గంటలక ఒక ప్లాన్ వేశారు. ఇది నిజం కాకపోతే మీరు బ్యాన్ ఎందుకు చేశారు? తర్వాత ఎందుకు ఎత్తివేశారు. బ్యాన్ విధించి ఎత్తి వేశారంటే మీరు తప్పు చేసినట్లే కదా.... మొత్తం మా అసోసియేషన్ బాడీ రిజైన్ చేయండి అని నట్టి కుమార్ డిమాండ్ చేశారు.

     ఆ రోజు పవన్ కళ్యాణ్ ఛాంబర్లో ఏం చేశారంటే...

    ఆ రోజు పవన్ కళ్యాణ్ ఛాంబర్లో ఏం చేశారంటే...

    పవన్ కళ్యాణ్ గారు చాంబర్ కు వచ్చారు. రెండు విషయాలు అడిగారు. నా తల్లిని తిట్టించారు.... చాంబర్ ఏం చేస్తోంది? అని అడగటంతో పాటు, దీని మీద ఎంక్వయిరీ చేయమని డీజీపీకి కంప్లయింట్ ఎందుకు ఇవ్వలేదు. అసలు ఇష్యూ ఎక్కడిది? నా మీదకు ఎందుకొచ్చింది అని ఆయన అడిగారు..... అని నట్టి కుమార్ తెలిపారు.

    English summary
    Producer Natti Kumar About Pawan Kalyan and Sri Reddy Issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X