For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishna Family: కృష్ణ కుటుంబంలో ఆస్తి గొడవలు.. అసలు నిజాలు బయటపెట్టిన నిర్మాత

  |

  సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని ఇటు సినీ, రాజీయ సెలబ్రిటీలు, అటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన కుటుంబసభ్యులు అయితే తీవ్ర శోకసంద్రలో మునిగిపోయారు. నవంబర్ 16 బుధవారం రోజున సాయంత్ర అశేష అభిమానుల మధ్య జరిగిన అంతిమయాత్ర అనంతరం కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో ఆస్తి గొడవలు, పంపకాలు, మహేశ్ బాబు లవ్ మ్యారేజ్ తదితర ఆసక్తికర అంశాలపై అసలు నిజాలను బయట పెట్టారు ప్రముఖ నిర్మాత నట్టికుమార్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  సినీ లోకానికి విషాదం..

  సినీ లోకానికి విషాదం..

  సూపర్ స్టార్ కృష్ణ మరణం యావత్ సినీ లోకాన్ని తీవ్ర విషాదం మిగిల్చింది. ఆయన లేని లోటు తీర్చలేదని సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మరణం, ఆయనతో ఉన్న తన అనుబంధాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ కుటంబంలో జరిగిన ఆస్తి గొడవలు, పంపకాల గురించి సంబంధించిన ఆసక్తికర విషయాలని నట్టి కుమార్ తెలిపారు.

  పేరు పేరునా పిలిచి మరి..

  పేరు పేరునా పిలిచి మరి..

  సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ బాధ్యతల విషయంలో చేతులెత్తి మొక్కాలి. ఆరోజు నుంచి ఇప్పటివరకు పిల్లల విషయంలోగానీ, కుటుంబం విషయంలోగానీ, ఆస్తుల్లో గానీ చాలా జాగ్రత్తగా ఉన్నారు. హనుమంత రావుగారి పిల్లలు, గానీ శేషగిరి రావు పిల్లలు, అక్కలు, అత్తలు చాలా పెద్ద కుటుంబ వాళ్లది. ఇంతపెద్ద హీరో అయినా అందరిని పేరు పేరునా పిలిచి మరి పలకరించేవారు. ఆయన ఎదుట నిల్చోడానికే భయమేసేది కానీ ఆయన మాత్రం అక్కా.. అత్తా అంటూ పలకరించి మరి అడిగేవారు.

  ఒకే సంవత్సరం చనిపోవడం..

  ఒకే సంవత్సరం చనిపోవడం..

  ఆయన నుంచి నేర్చుకోవాల్సింది డేరింగ్, క్రమశిక్షణ, డేట్ టు డేట్ రిలీజ్ చేయాలి. అలా చేయాలంటే ఆరు గంటల దాకా షూటింగ్ చేసి.. రాత్రి 2 గంటలవరకు ఎడిటింగ్ చేసి తెల్లారి ఆరు గంటలకు షూటింగ్ కు వెళ్లిన వ్యక్తి. కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి. సంక్రాంతి సినిమాలు ఆయనవే నిజాలి. కుటుంబంలో అందరూ ఒకే సంవత్సరం చనిపోవడం చాలా బాధకరమైన విషయం. చాలా మంచి కుటుంబం.

  బయటకు రాకుండా..

  బయటకు రాకుండా..

  ఇందాక మీరు ఒకటి అడిగారు. బయటకు ఏం తెలియనివ్వకుండా, పలుచన కాకుండా చేశారని. అసలు ఏది బయటకు రాకుండా, ఆస్తుల విషయంలోగానీ, అన్ని కూడా అందరికీ సరిసమానంగా, చక్కగా బయటకు రాకుండా, ఏం జరిగిందే తెలియకుండా, అన్ని కుటుంబ విషయాలు కావొచ్చు, ఆస్తి విషయాలు అవ్వొచ్చు ఒక పెద్ద దిక్కుగా ఇదిగో ఇది.. అది అని.. మ్యారేజ్ విషయాల్లో ఏ ఒక్కటి కూడా కృష్ణ గారి ఫ్యామిలీ ఇది అన్న మాట బయట ఎక్కడా రాకుండా చూసుకున్నారు.

  నమ్రతా కుటుంబానికి అభిమానం..

  నమ్రతా కుటుంబానికి అభిమానం..

  కూతుళ్లను కూడా మంచి మంచి కుటుంబంలోకి ఇచ్చారు అని తెలిపారు. తర్వాత "మహేశ్ బాబు ప్రేమ విషయంలో రమేష్ బాబు వ్యతిరేకించినా బ్యాలెన్స్ గా వెళ్లి ఆ పెళ్లి చేసుకుని తీసుకొచ్చి ఆ ఇంట్లో కలుపుకోవడం కావొచ్చు, ఏది కూడా ఒక నెగెటివ్ అంశం రాకుండా దాన్ని చూసుకున్నారు" అని యాంకర్ చెప్పబోతుంటే.. "ఆ అమ్మాయి (నమ్రతా) కుటుంబంలో కృష్ణగారు అంటే ఫేవరేట్. ఆయనంటే వాళ్లందరకి అమితమైన అభిమానం. ఆ అమ్మాయికి నమ్రతా గారికి ఆయనంటే చాలా అభిమానం.

  సొంతంగా రాజకీయాల్లోకి వెళ్లలేదు..

  సొంతంగా రాజకీయాల్లోకి వెళ్లలేదు..

  అలా బ్యాలెన్స్ చేయడంలో మంచితనం. ఆ మంచితనం ఎవరికీ రాదు. అలాంటి మంచి వ్యక్తి చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. కానీ ఆయన చేసిన ప్రతి పనిలో ఆయన మార్క్ కనిపిస్తుంది. ఆయన జ్ఞాపకాలతో ఎప్పుడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు. కృష్ణ గారు ఆయన సొంతంగా రాజకీయాల్లోకి వెళ్లలేదు. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ప్రత్యేకంగా కృష్ణ గారిని గుర్తించి, ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిపించుకున్నారు.

  స్వయంగా రాజీవ్ గాంధీ చెప్పారు..

  స్వయంగా రాజీవ్ గాంధీ చెప్పారు..

  పిలిపించి.. మీరు ఎంపీగా ఉండాలి. మా పార్టీలో ఉండాలి అని అడిగిన వ్యక్తుల్లో రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. ఆయన అదే కమిట్ మెంట్ తో అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటే కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ గారికి రాజశేఖర్ రెడ్డి ఎంత ఇష్టమో, కృష్ణ గారు అంటే అంత ఇష్టం. రాజీవ్ గాంధీ గారు స్వయంగా చెప్పారు.. కృష్ణ నా ఫేవరెట్ హీరో అని. కృష్ణ గారిని స్వయంగా పిలుపించుకుని రెండు సార్లు ఎంపీ సీట్ ఇచ్చారు.

  English summary
  Producer Natti Kumar Reveals About Superstar Krishna Family Property Issues And Mahesh Babu Marriage In An Latest Interview
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X