twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా టికెట్ రేట్స్ పై నిర్మాత నట్టికుమార్ అసహనం.. హైకోర్టును ఆశ్రయిస్తా అంటూ డెడ్ లైన్

    |

    సినీ పరిశ్రమలో ఆంధ్ర ప్రదేశ్ టికెట్ల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్న చందాన ఏపీలో భారీగా టికెట్ల రేట్ల కోత అంటే తెలంగాణాలో మాత్రం టికెట్ రేట్ల పెంపు అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయం మీద నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    ఊరట

    ఊరట

    కరోనా కారణంగా గత రెండేళ్లుగా తీవ్ర స్థాయిలో నష్టపోయిన సినీ ఇండస్ట్రీ.. థియేటర్ యాజమాన్యాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవల విడుదలైన అఖండ, పుష్ప సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ కూడా వర్షంలా కురిపిస్తూ ఉండడంతో ఒకపక్క నిర్మాతలతో పాటు.. థియేటర్స్ యాజమానులకు సైతం ఊరటనిచ్చింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి వేరేలా ఉందనుకోండి అది వేరే విషయం.

    రైడ్స్ చేసి సీ

    రైడ్స్ చేసి సీ


    ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ ప్రముఖులు బహిరంగంగా అసహనం వ్యక్తం చేయగా ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ అవుతోంది. వాళ్ళ వ్యాఖ్యలకు తగ్గట్టుగానే ఇప్పటికే పలుచోట్ల థియేటర్ల మీద రైడ్స్ చేసి సీజ్ చేశారు. మరికొన్ని చోట్ల స్వచ్ఛందంగా మూతపడ్డాయి.

    టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చు

    టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చు

    అయితే మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సినిమా విడుదల సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చు అంటూ జీవో జారీ చేసింది సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపగా తాజాగా నిర్మాత నట్టికుమార్ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పై అసహనం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల నట్టికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

    చిన్న సినిమాలకు అన్యాయం

    చిన్న సినిమాలకు అన్యాయం


    తెలంగాణలో సినిమా టిక్కెట్ల రేట్లు భారీగా పెంచడంతో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుంది నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. టికెట్ రేట్లు పెంచడం వలన చిన్న సినిమాలకు అన్యాయం జరగడమే కాకుండా.. మల్టీఫ్లెక్స్‏లో సినిమా చూడాలన్న కల కలగానే మిగిలి పోతుందని నట్టికుమార్ అన్నారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ 1955 నిబంధనలు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో లేనే లేవని ఆరోపించారు.

    జనవరి 5, 6 తేదీ కల్లా

    జనవరి 5, 6 తేదీ కల్లా

    ఇక చిన్న సినిమాలు కూడా లాభపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలని.. పది రోజుల్లోగా చిన్న సినిమాలకు మేలు చేసే నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తానని నట్టికుమార్ హెచ్చరించారు. మరోపక్క ఏపీలో థియేటర్ల సమస్యలపై నిర్మాత నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే టికెట్ రేట్లు సహా థియేటర్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన వెల్లడించారు. జగన్ పై తనకు పూర్తి నమ్మకం ఉందన్న నట్టి "జనవరి 5, 6 తేదీ కల్లా ఏపీలో థియేటర్స్ సమస్యలతో పాటు అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయి. ఇందులో ప్రతి పక్షాలు ఇన్వాల్వ్ కాకుండా ఉండాలన్నారు.

    ప్రతిపక్షాల కుట్ర

    ప్రతిపక్షాల కుట్ర


    ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అన్ని చేస్తుందన్న ఆయన న్యాయస్థానం పైన కూడా పూర్తి నమ్మకం ఉందని, ఏపీలో ఎక్కడా టికెట్ రేట్లు తగ్గించ లేదు. ప్రజలెవరూ అపోహలు పెట్టుకోవద్దని చెప్పుకొచ్చారు. కొందరు రేట్లు తగ్గించారని లేని పోని ప్రచారం చేస్తున్నారని ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్రని నట్టికుమార్ అన్నారు.

    English summary
    Producer Natti Kumar Crucial Comments On telangana Movie Ticket Rates hike
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X