నిఖిల్ నువ్వు మగాడివైతే నిరూపించు.. టాలీవుడ్ నుంచి వెళ్ళిపోతావా.. నిర్మాత నట్టి కుమార్!
ముద్ర సినిమా టైటిల్ వివాదం రచ్చకెక్కింది. అటు హీరో నిఖిల్, ఇటు నిర్మాత నట్టి కుమార్ మీడియా ముఖంగా పరస్పర దూషణలకు దిగుతున్నారు. నిఖిల్ హీరోగా ముద్ర అనే చిత్రం తెరకెక్కుతోంది. టీఎన్ సంతోష్ ఈ చిత్రానికి దర్శకుడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే టైటిల్ తో జగపతి బాబు ప్రధాన పాత్రలో నట్టికుమార్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదం తారాస్థాయికి చేరుకుంది. నేడు నిర్మాత నట్టి కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరి హీరో నిఖిల్ పై విరుచుకుపడ్డారు.

టికెట్స్ అమ్ముకుంటున్నారు
నట్టి కుమార్ నిర్మించిన ముద్ర చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. నా సినిమా టైటిల్, లోగోని కాపీ చేశారని నిఖిల్ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా నట్టి కుమార్ పై విమర్శలు సంధించాడు. దీనితో వివాదం మొదలైంది. రాఘవేంద్ర థియేటర్ వద్ద నా సినిమా టైటిల్ వేసుకుని టికెట్స్ అమ్ముకుంటున్నారని నిఖిల్ ఆరోపించారు. ప్రేక్షకులంతా ఈ సినిమాని చూడవద్దని కోరాడు.

నిఖిల్ నువ్వు మగాడివైతే
నిర్మాత నట్టి కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిఖిల్ నువ్వు నిర్మాతవా.. నీ సినిమా టైటిల్ ఏంటో నీకు నీ నిర్మాతలు చెప్పారా. ముద్ర నా టైటిల్ అని నిరూపించడానికి నా వద్ద ఆధారాలు ఉన్నాయి. సెన్సార్ సర్టిఫికెట్ ఉంది. ఛాంబర్ ముద్ర టైటిల్ నాకు కేటాయించిన సర్టిఫికెట్ ఉంది. నిఖిల్ నీకు దమ్ముంటే, మగాడివైతే డిబేట్ కి వచ్చి ముద్ర టైటిల్ నీదే అని నిరూపించుకో. ఎక్కడికి రమ్మన్నా నేను డిబేట్ కి వస్తా. ఈ టైటిల్ నాది కాదు అని నువ్వు నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధం. నువ్వు నిరూపించలేకపోతే టాలీవుడ్ నుంచి వెళ్ళిపోతావా అని నట్టి కుమార్ ఛాలెంజ్ చేశారు.

అంత చీప్ అయిపోయారు
నిర్మాతని అగౌవరవంగా మాట్లాడుతున్నావ్.. నిర్మాతలంటే అంతా ఛీప్ అయిపోయారా.. నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావంటే అందుకు కారణం నిర్మాత అని నట్టికుమర్ అన్నారు. ఎవడో ఒకడు అన్నా నీ సినిమా అనుకుని టికెట్స్ కోనేశాం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దానిని నువ్వు షేర్ చేశావు. అసలు ఇంతవరకు అమ్ముడైంది ఒక్క టికెట్ మాత్రమే అని నట్టి కుమార్ అన్నారు. నువ్వు కావాలనే నీవాళ్లతో నా సినిమా విడుదల ఆపాలని చూస్తున్నావ్ అని నట్టి కుమార్ నిఖిల్ పై ఆరోపణలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నట్టి కుమార్ తెలిపారు.

ఆత్మహత్య చేసుకుని ఉంటారు
నువ్వు చేసిన కుట్రకు మరో నిర్మాత అయితే ఆత్మహత్య చేసుకుని ఉంటారు. నేను కాబట్టి నీతో పోరాడుతున్నా. అర్థరాత్రి పబ్బుల్లో నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు. ప్రతిరోజూ నీకు ఇదే అని నిఖిల్ పై నట్టికుమార్ మండిపడ్డారు. సోమవారం కల్లా నిఖిల్ క్షమాపణలు చెప్పాలి. లేకుంటే నిర్మాతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం అని నట్టికుమార్ తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో దీనిపై స్పందించాలి అని నట్టికుమార్ కోరారు.


Click it and Unblock the Notifications











