For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  థియేటర్ల మూసివేత వెనుక కుట్ర.. చిరు, నాగ్, బాలయ్య సమాధానం చెప్పాలి.. నట్టి కుమార్ ఫైర్

  |

  కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా మూసివేసిన థియేటర్లను ఓపెన్ చేయకపోవడంపై ప్ర‌ముఖ నిర్మాత‌, ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్సు జాయింట్ సెక్ర‌ట‌రీ న‌ట్టికుమార్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత 8 ఎనిమిది నెలలుగా సినీ రంగంలో చోటుచేసుకొన్న సమస్యలపై ఘాటుగా స్పందించారు. థియేటర్లను ఓపెన్ చేయకపోవడం వెనుక పెద్ద లాబీయింగ్ జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. థియేటర్లు ఓపెన్ చేయకపోవడం వెనుక కొందరి హస్తం ఉందని విమర్శించారు. సోమవారం నిర్మాత నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ...

  సినిమా హాళ్లు నాశనం అవుతున్నాయి...

  సినిమా హాళ్లు నాశనం అవుతున్నాయి...

  సినిమా థియేటర్లు మూతపడటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లు నాశనం అవుతున్నాయి. పిఠాపురంలోని థియేటర్లలో ఫర్నీచర్‌ చోరికి గురైంది. కొన్ని చోట్ల ఫర్నీచర్‌ను ఎలుకలు నాశనం చేశాయి. సినిమా రంగంలోని కొందరు లాబీయింగ్ వల్ల థియేటర్లు తెరచుకోకుండా మూతపడ్డాయి. రైళ్లు, విమానాళ్లో లేని నిబంధనలు థియేటర్లకే ఎందుకు అంటూ నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

   రోడ్డుపైకి వేలాది మంది కార్మికులు

  రోడ్డుపైకి వేలాది మంది కార్మికులు

  తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లను మూసివేయడం వల్ల వేల సంఖ్యలో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. షూటింగులు ఆపివేయడం రోజువారీ వేతన కార్మికులు రోడ్డున పడ్డారు. కరోనా క్రైసిస్ ఛారిటీ తరఫున చిరంజీవి ఆధ్వర్యంలో మూడు దఫాలుగా నిత్యావసర వస్తువులు అందించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వారి సమస్యలు పట్టవా? సినిమా థియేటర్ల నుంచి పన్నుల రూపంలో ఆదాయం వస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు వారిని కనీసం ఆదుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

   పెద్ద హీరోలు దర్జాగా ఓటీటీలోకి

  పెద్ద హీరోలు దర్జాగా ఓటీటీలోకి

  లాక్‌డౌన్ కారణంగా థియేట‌ర్ల మూసివేసి ఓటీటీ ద్వారా పెద్ద హీరోలు తమ సినిమాలు విడుద‌ల చేసుకోవడ ఎంత వ‌ర‌కు క‌రెక్ట్. పెద్ద హీరోలందిర‌కీ కోట్లు మార్కెట్ ఉందంటే కేవ‌లం థియేట‌ర్ల వ‌ల్ల‌నే అని గుర్తుంచుకోవాలి. నాని V సినిమా ఓటీటీలో విడుద‌ల చేశారు. మరికొంత మంది పెద్ద హీరోల చిత్రాలు విడుద‌ల కాబోతున్నాయి. ఇది ఎంత వ‌రకు క‌రెక్ట్‌. ఇలా జ‌రిగితే ఇక థియేట‌ర్లు మూసివేయాలా?. దీనికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తోపాటు చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ లాంటి పెద్ద‌లు స‌మాధానం చెప్పాలి అని నట్టి కుమార్ ప్ర‌శ్నించారు.

  చిన్న సినిమాలను నియంత్రిస్తున్నారు..

  చిన్న సినిమాలను నియంత్రిస్తున్నారు..

  సినీ రంగంలో చాలా సమస్యలు ఉన్నాయి. LLLP అనే గ్రూప్ పెట్టి కేవలం 21 మంది సినిమా రంగాన్ని శాసిస్తున్నారు. ఇప్పుడు వారు చెప్పిందే వేదంగా మారింది. చిన్న సినిమాలకు పబ్లిసిటీ లేకుండా కట్టడి చేశారు. దాంతో కొన్ని పత్రికలకు మాత్రమే వ్యాపార ప్రకటనలు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి సమస్యలు తెలిసినా ఫిలిం ఛాంబర్ ఎందుకు మౌనం వహిస్తున్నది. కొందరి లాబీయింగ్ వల్ల నోరు మెదపడం లేదు. ఇది ఎంతవరకు సమంజసం అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

  Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!
  నట్టి కుమార్ జన్మదినం సందర్భంగా .. సినిమాల గురించి

  నట్టి కుమార్ జన్మదినం సందర్భంగా .. సినిమాల గురించి

  సెప్టెంబర్ 7వ తేదీన మంగ‌ళ‌వారం తన పుట్టినరోజు సందర్భంగా న‌ట్టి కుమార్ తమ సంస్థలో తీయబోయే చిత్రాలను ప్ర‌క‌టించారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి కొన్ని సినిమాలు తీయబోతున్నాం. ఈ నెల 9న సైకో వ‌ర్మ‌ చిత్రం షూటింగును ప్రారంభిస్తాం. దెయ్యంతో స‌హ‌వాసం అనే మరో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ రెండు చిత్రాలకు స్వయంగా దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నాను. గతంలో 8 చిత్రాలకు దర్శకత్వం వహించాను. నిర్మాతగా 65 చిత్రాలు నిర్మించాను అని నట్టి కుమార్ తెలిపారు. నిర్మాత‌లుగా నా కొడుకు, కూతురు ముందుకు వ‌చ్చి సినిమాలు చేస్తున్నారు. దిశ ఎన్‌కౌంట‌ర్ సినిమా ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. ఇంకా ఆరు సినిమాలు ప్రొడక్షన్‌లో ఉన్నాయి అని నట్టి కుమార్ పేర్కొన్నారు.

  English summary
  Producer Natti Kumar fires on Lobbying in Tollywood. He raises few issues like daily wage workers in film industry and Theatres opening. He questioned about Big heroes movie releases in OTT. Natti Kumar concerned over small budget movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X