'తెలుగు సినీ పరిశ్రమ పరువు గంగపాలు..ఊహించని శిక్ష..
బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హేమ ఎపిసోడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పార్టీకి వెళ్లి అడ్డంగా దొరికిపోయింది చాలక .. తాను స్పాట్‌లోనే లేనంటూ వీడియోలు రిలీజ్ చేసి మీడియాను, సమాజాన్ని తప్పుదోవ పట్టించింది. పోలీసులు జోక్యం చేసుకుని హేమ తమ అదుపులోనే ఉందని చెప్పుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. ఆమె రేవ్ పార్టీకి హాజరైనట్లు విలేకరుల సమావేశంలో ఆధారాలతో సహా విడుదల చేశారు బెంగళూరు పోలీస్ కమీషనర్ దయానంద్.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ రేవ్ పార్టీకి హాజరైనట్లుగా సీపీ వెల్లడించారు. తీరా రేవ్ పార్టీకి హాజరైన వారి బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించగా హేమకు పాజిటివ్‌గా తేలింది. ఆ క్షణం నుంచి ఆమె డ్రామాలు ఆపి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. అంతేనా.. తమ ఎదుట విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈ నెల 27న సీసీబీ ఎదుట హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు పోలీసులు.

ఈ ఎపిసోడ్‌తో హేమపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ పరువు తీశావంటూ పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా హేమ తీరును ఖండిస్తున్నారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం హేమకు అండగా నిలిచారు. ఆమెపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని ఖండించారు. కొన్ని సామాజిక మాధ్యమాలు , మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని హేమ మండిపడ్డారు. నిరాధారమైన ఆరోపణలను , ప్రచారాన్ని మానుకోవాలని.. దోషిగా తేలేవరకు హేమ నిర్దోషేనని విష్ణు అన్నారు. ఈ వ్యవహారంలో ఖచ్చితమైన ఆధారాలను పోలీస్ శాఖ అందిస్తే మా అసోసియేషన్ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ, హేమ ఇష్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత నట్టికుమార్. ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. రేవ్ పార్టీకి వెళ్లినవారికి రేవ్ పెట్టేయాలన్నారు. వాళ్లకి సిగ్గుంటే బర్త్ డే పార్టీలు చేసుకోవాలని, ఇంకొంచెం డబ్బుంటే ఇష్టమొచ్చినట్లు ఎంజాయ్ చేసుకోవచ్చని.. కానీ గంజాయి, డ్రగ్స్ తీసుకోవడం ఏంటని నట్టికుమార్ మండిపడ్డారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. హేమ తప్పు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని, మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు రేవ్ పార్టీకి వెళ్లాల్సిన అవసరం తెలుగు నటులకి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

ఈవెంట్ మొత్తాన్ని హేమనే ఆర్గనైజ్ చేసిందనే ప్రచారం జరుగుతోందని.. ఒకవేళ అలా చేస్తే ఆమె సమాజంలో బతికేందుకు అనర్హురాలని, బహిష్కరించాలని నట్టికుమార్ చెప్పారు. నిజంగా హేమ పార్టీలో లేను అంటే వెంటనే సినీ పెద్దల ద్వారా విషయం కర్ణాటక సీఎం దృష్టికి తీసుకెళ్లి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని బద్నాం చేసిన పోలీసులపై చర్య తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
గతంలో సురేష్ కొండేటి అనే వ్యక్తి టాలీవుడ్ పరువును గోవాలో తీస్తే అతనిని మా అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూషన్ నుంచి తొలగించామని నట్టికుమార్ గుర్తుచేశారు. రేవ్ పార్టీని పెడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, రౌడీ షీట్ తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. రేవ్ పార్టీకి రాజకీయ నాయకులకు అవినాభావ సంబంధం వుందని నట్టికుమార్ ఆరోపించారు. ఇప్పటికే సినీ పరిశ్రమ ప్రజల్లో బాగా చులకన అయ్యిందని.. ఇలాంటి రేవ్ పార్టీల వల్ల మరింత దిగజారుతుందన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా అధ్యక్షుడు మంచు విష్ణుకి నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











