Chandrababu Arrest చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించరా? చిరు, రాజమౌళి, బోయపాటిని ఏకి పారేసిన నట్టి కుమార్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని మానవత్వాన్ని ప్రదర్శించాలి. రాజకీయాలంటే ప్రతిపక్షం, అధికార పక్షం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతున్నది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తీరు చూస్తే నాకు చాలా బాధనిపించింది. అందుకే నేను ప్రెస్‌మీట్ పెట్టి ఖండించేందుకు వచ్చాను అని నిర్మాత నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన నుంచి లబ్ది పొందిన వాళ్లు ఈ సమయంలో ఆయనకు అండ లేకుండా పోయారు. కనీసం చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను ఖండించలేదు. నన్ను చూసి ఖండిస్తారేమో అనుకొన్నాను. కానీ అది జరుగలేదు. తెలుగు సినిమా పరిశ్రమకు చంద్రబాబు ఎంతో చేశాడు అని నట్టి కుమార్ అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ అయితే అల్లు అరవింద్, అశ్వినీదత్, ఎస్ఎస్ రాజమౌళి, బోయపాటి శ్రీను, చిరంజీవి, ప్రభాస్, రాఘవేంద్రరావు, సురేష్ బాబు, మురళీ మోహన్ గారు ఖండించకపోవడం బాధగా ఉంది. ఆయన వెంటే మేమున్నామని చెబితే ఎంత బాగుండేది అని నట్టి కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన నుంచి లబ్ది పొందిర వారే ఇప్పుడు నోరు మెదపడం లేదు అని నట్టి కుమార్ అన్నారు.
చంద్రబాబు నుంచి లబ్ది పొందిన వారు ఖండించకపోగా మేము వెనుక ఉన్నామని చెబుతున్నారు. అలా వెనుక ఉన్నవారు దొంగలు. చంద్రబాబు నుంచి లబ్ది పొందిన ప్రతీ ఒక్కరు ధైర్యంగా ముందుకు వచ్చి మీ వెంట మేము ఉన్నామని మద్దతు ప్రకటించాలి. అలా ప్రకటించిన వాళ్లే నిజమైన హీరో. ఆ విషయంలో పవన్ కల్యాణ్ నిజమైన హీరో అని నట్టి కుమార్ పేర్కొన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ కల్యాణ్ మాదిరిగా హీరోగా ఉన్నవారు ఎంత మంది ఉన్నారో చూడాలి. భయపడి వెనుక దాచుకొంటారో కాలమే చెబుతుంది. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రతీ ఒక్కరు ఖండించాల్సిందే. జైలు నుంచి బయటకు రావాలి. మీరు ప్రజలకు కోసం 24 గంటలు పనిచేయాలి అని నట్టి కుమార్ కోరుకొన్నారు.
ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను 14 రోజుల రిమాండ్‌పై రాజమహేంద్రవరం జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అనుకూల వర్గం అరెస్ట్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











