Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టెమ్ట్ కాకుండా ఉంచేచాలు..అదే సక్సెస్ సీక్రెట్ అంటున్న నిర్మాత
కథ చాలా బాగుందనో, లేక మరొక కారణంచేతనో టెంప్ట్ అయ్యి..నేనే తీసే సినిమాలో నటిస్తున్న హీరోకున్న మార్కెట్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టను. లాభం రాకపోయినా, నష్టం రాకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. అందుకే ఇన్ని సినిమాలు తీయగలిగాను అదే నా విజయ రహస్యం అంటున్నారు నిర్మాత నట్టికుమార్. గుప్తశాస్త్రం వంటి సెక్స్ చిత్రంతో కెరీర్ ప్రారంబించిన నట్టికుమార్..ఈ పదేళ్లలో దాదాపు 55 నిర్మించారు. 56 వ చిత్రంగా శ్రీహరితో భైరవ తీస్తున్నారు. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ అడవి చిత్రం తెలుగు వెర్షన్ కి కూడా నట్టికుమారే నిర్మాత. అలాగే ఈ చిత్రం తర్వాత 'ఎ ఫిలిం బై అరవింద్" ఫేం శేఖర్సూరి దర్శకత్వంలో డారాజశేఖర్ హీరోగా ఒక చిత్రం, నట్టికుమార్..అభిమాన హీరో శ్రీహరితో విజయన్ మాస్టర్ దర్శకత్వంలో మరో చిత్రం, పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్‌శంకర్‌తో మరో చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సంవత్సరానికి కనీసం ఆరు సినిమాలు నిర్మించాలన్నది నా లక్ష్యం అని చెప్తున్నారు. ఈ యంగ్ నిర్మాత ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ధట్స్ తెలుగు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.