సినీ నిర్మాతకు షాక్.. ఆ సినిమాతో వివాదం.. చెక్ బౌన్స్ కేసులో శిక్ష
సినీ పరిశ్రమలో వ్యవహారాలన్ని ఒక్కోసారి ఇలాగే ఉంటాయి. నిర్మాతలు చెక్కులు ఇస్తారు.. కానీ అందులో డబ్బులు ఉండవు. ఇక కేసుల వేస్తే ఏళ్ల పాటుగా కోర్టుల చుట్టు తిరుగుతూనే ఉంటారు. అవి ఎప్పుడు తెగుతాయో ఎవ్వరికీ తెలియవు. తాజాగా అలాంటి ఓ కేసుకు సంబంధించిన తీర్పు తాజాగా వెలువడింది.

శంఖం సినిమాతో వివాదం..
శంఖం సినిమాను తమ థియేటర్‌లో రెండు వారాల పాటు ప్రదర్శించమని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ మేరకు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్‌కు విజయనగరంలోని రాజ్యలక్ష్మీ థియేటర్ యాజమాన్యానికి డీల్ కుదిరిందట.

వారం రోజులే..
కరుణాలయ ఫిల్మ్స్ పేరుతో విశాఖలో సినీ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. 2009 సెప్టెంబర్‌లో విజయనగరంలోని రాజ్యలక్ష్మీ థియేటర్‌లో ‘శంఖం' సినిమా రెండు వారాల పాటు ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యంతో రూ.6.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వారం రోజులే ప్రదర్శించారు.

సినీ పెద్దల మధ్యవర్తిత్వం..
అయితే సినీ పెద్దల జోక్యంతో కుదిరిన రూ.6.5 లక్షల ఒప్పందానిని బదులుగా నిర్మాత రూ.5.5 లక్షలు థియేటర్ యాజమాన్యానికి ఇవ్వడానికి అంగీకరించి చెక్‌ను థియేటర్ మేనేజింగ్ పార్ట్‌నర్ ఎ.రవికుమార్‌కు ఇచ్చాడు. అయితే అది కూడా బౌన్స్ అయింది.
Recommended Video


తీర్పిచ్చిన మొబైల్ మెజిస్ట్రేట్..
దీంతో చెక్ బౌన్స్ కేసులో నట్టికుమార్‌కు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ స్థానిక మొబైల్ మెజిస్ట్రేట్ కె.దీపదివ్యకృప శుక్రవారం తీర్పు చెప్పారు.


Click it and Unblock the Notifications











