twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan Kalyan..ఆ నిర్మాతలు డబుల్ గేమ్ ఆడుతున్నారు..మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు..నట్టి కుమార్ ఫైర్

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సినీ రచయిత పోసాని కృష్ణ మురళీ వివాదంలో తెలంగాణ వాదాన్ని తీసుకురావడంపై చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో చర్చించకుండా కొందరు నిర్మాతలు తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ.. అనేక అనుమానాలకు, వివాదాలకు తావిచ్చేలా వ్యవహరిస్తున్నారు. వాళ్ల సొంత ప్రయోజనాలకు కోసం వారు డబుల్ గేమ్ ఆడుతున్నారని తీవ్రంగా నట్టి విమర్శించారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఘాటుగా స్పందించారు. నట్టి కుమార్ మాట్లాడుతూ..

    Anchor Manjusha : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంజూష హొయలు.. చూశారా?Anchor Manjusha : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంజూష హొయలు.. చూశారా?

    పోసాని వివాదంలో తెలంగాణ వాదమా?

    పోసాని వివాదంలో తెలంగాణ వాదమా?

    పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్, పోసాని కృష్ణ మురళీ మధ్య వివాదాన్ని తప్పుపడుతున్నాను. ఇద్దరు కూడా ఫ్యామిలీలను టార్గెట్ చేయడం సరికాదు. ఎవరికైనా కుటుంబాలు ఉన్నాయి. అలాంటిది మనం ఇంట్లో ఉన్నవాళ్లను తిట్టడం సరికాదు. పోసాని, పవన్ కల్యాణ్ విషయంలో తెలంగాణ, ఆంధ్రా అంటూ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించడం సరికాదు.

    ఆంధ్రా నా కొడుకుల్లారా ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటూ అర్ధరాత్రి మెసేజ్‌లు వస్తున్నాయి. కానీ మేమంత ఇక్కడే స్థిరపడ్డాం. మా పిల్లలు ఇక్కడే పుట్టారు. మాకు ఆంధ్రా, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు లేవు. మాకు ఒకటే తెలుగు వాళ్లం. మాకు తెలుగు వాళ్లందరూ ఒక్కటే అని భావిస్తున్నాం అని నట్టి కుమార్ అన్నారు.

    పవన్ కల్యాణ్‌కు ఆ హక్కు ఉంది అంటూ

    పవన్ కల్యాణ్‌కు ఆ హక్కు ఉంది అంటూ

    పవన్ కల్యాణ్ మాకు బిగ్గెస్ట్ స్టార్. మాకు హీరో. ఆయన రాజకీయాలతో మాకు సంబంధం లేదు. కానీ సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై పవన్ కల్యాణ్ మాట్లాడటం కరెక్ట్. ఆయన వేరే పార్టీని తిట్టడం మాకు సంబంధం లేదు. కేవలం ఆయన సినిమా పరిశ్రమపై స్పందించినందుకు ఆనందంగా ఉంది. ఆయనకు సినిమా పరిశ్రమ సమస్యలపై మాట్లాడే హక్కు ఉంది. ఆయనకు, ఇతర పార్టీకి ఉన్న విభేదాలు సినిమా పరిశ్రమకు సంబంధం లేని విషయం అని నట్టి కుమార్ స్పష్టం చేశారు.

    పవన్ కల్యాణ్‌ను ఆ నిర్మాతలు తప్పుదోవ

    పవన్ కల్యాణ్‌ను ఆ నిర్మాతలు తప్పుదోవ

    ఏపీ ప్రభుత్వంతో కొందరు నిర్మాతలు జరిపిన చర్చల గురించి పవన్ కల్యాణ్‌కు చెప్పలేదు. ఆయనను కొందరు నిర్మాతలు తప్పుదారి పట్టించారు. అంతేకాకుండా మీ వల్లనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నదని పవన్‌కు నిర్మాతలు చెప్పి ఆయనకు రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన తర్వాత అదే నిర్మాతలు అక్కడికి వెళ్లి క్షమాపణలు చెప్పారు. మళ్లీ ఇక్కడకు వచ్చి పవన్ కల్యాణ్‌తో కలిసి నవ్వుతూ ఫోటోలు దిగారు. దీంతో పవన్ కల్యాణ్ రాజీ చేసుకోవడానికి ఆ నిర్మాతలను పంపించారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని నట్టి కుమార్ అన్నారు.

    మంత్రి నానిని కలిసిన వాళ్లే పవన్ కలిసి..

    మంత్రి నానిని కలిసిన వాళ్లే పవన్ కలిసి..

    ఏపీ మంత్రి పేర్ని నానిని కలసి వచ్చిన పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు అక్కడ మాట్లాడిన విషయాలను స్పష్టంగా పరిశ్రమకు తెలియజేయకపోవడం కూడా అనేక అపోహలకు దారితీసింది. అక్కడ ఏం మాట్లాడి వచ్చింది పరిశ్రమ నుంచి వెళ్లిన ఆ పెద్ద మనుషులు బయటకు వెల్లడించకపోగా పవన్ ను రెచ్చగొట్టేలా డబుల్ గేమ్ ఆడారు.

    దాంతో పవన్ మాట్లాడిన మాటలు వివాదమయ్యాయి. రాజకీయాల గురించి పవన్ ఏవైనా మాట్లాడుకోవచ్చు. కానీ పెద్ద స్టార్ అయిన పవన్ సినీరంగం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవిక విషయాలు తెలుసుకుని మాట్లాడితే బావుండేది. పవన్ తో సినిమాలు తీస్తున్న ఆ పెద్ద మనుషులే నిన్న మంత్రి పేర్ని నాని వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. పవనే వారిని పంపించినట్లు బయట వదంతులు కూడా వినిపిస్తున్నాయి. దీనిని పవన్ ఏ విధంగా తీసుకుంటారు. ఆ నిర్మాతల డబుల్ గేమ్ ను సమర్థిస్తారా? లేదా? అన్నది ఆయనే తేల్చుకోవాల్సిన అంశం అని నట్టి కుమార్ విమర్శించారు.

    నిర్మాతలు డబుల్ గేమ ఆడుతున్నారా?

    నిర్మాతలు డబుల్ గేమ ఆడుతున్నారా?

    చిరంజీవి గారు చిన్న నిర్మాతల గురించి కూడా ఆలోచించాలి. చిన్న నిర్మాతల అభిప్రాయాలను కూడా తీసుకోవాలి. ఆన్‌లైన్ విధానం ద్వారా టికెట్లు అమ్మే విషయంపై మాతో చర్చించాలి. ఛాంబర్, కౌన్సిల్‌కు సంబంధం లేకుండా ప్రభుత్వాలతో చర్చలు జరుపవద్దు. కేవలం పవన్ కల్యాణ్‌తో సినిమాలు తీసే నిర్మాతలే ఏపీ మంత్రి నానితో చర్చలు జరిపారు. అక్కడ పవన్ కల్యాణ్‌ను మంత్రి తిడుతుంటే నవ్విన నిర్మాతలు.. ఇక్కడ పవన్ కల్యాణ్‌తో నవ్వుతూ కనిపించారు. దాంతో వీళ్లు డబుల్ గేమ్ ఆడుతున్నారా? అనే అనుమానం కలుగుతున్నది అని నట్టి కుమార్ అన్నారు.

    తెలంగాణ వాళ్లు చంపేవాళ్లు కాదు..

    తెలంగాణ వాళ్లు చంపేవాళ్లు కాదు..

    పోసాని, పవన్ కల్యాణ్‌ వివాదంలో తెలంగాణ వాదాన్ని తీసుకురావోద్దు. తెలంగాణ ప్రాంతం అందరిని ఆదరించే గడ్డ. ప్రాణాలు పోయడం తెలుసుకానీ... ప్రాణాలు తీయడం తెలియదు. అలాంటి ప్రాంతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దు. దయచేసి ప్రాంతీయ విభేదాలు సృష్టించవద్దు అంటూ నట్టి కుమార్ కోరారు. పోసాని ఇంటిపై దాడి చేస్తారనే విషయం తెలిసి కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    Producer Natti Kumar serious on Dil Raju and other Tollywood producers who met Pawan Kalyan and Nani. Natti alleges that Producer are misguiding the pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X