ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి క్షమాపణ చెప్పు.. పవన్ కల్యాణ్‌పై డ్రగ్స్ ఆరోపణలపై నిర్మాత నట్టి కుమార్ ఫైర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డ్రగ్స్, మద్యం సేవిస్తారంటూ విమర్శలు చేసిన కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. వాస్తవాలకు విరుద్దంగా అసత్య ప్రచారాలు మానుకోవాలని నిర్మాత నట్టి హితవు పలికారు. పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నట్టి కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ..
పవన్ కల్యాణ్ మందు తీసుకొంటారు. డ్రగ్స్ తీసుకొంటారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తప్పుగా మాట్లాడి ఉంటాడు. ఆయనకు ఎవరైనా చెబితే.. నేరుగా ఫిలిం ఛాంబర్ వద్దకు సాక్ష్యాలతో వచ్చి నిరూపించాలి. నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడకూడదు. కాకినాడలో హుందాగా ఉండే వ్యక్తి ఇలాంటి విమర్శలు చేయకూడదు అని నట్టి కుమార్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సీఎం తర్వాత అంతటి పలుకుబడి ఉన్న వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తి ఇలా చవకబారుగా విమర్శలు చేయకూడదు. పవన్ కల్యాణ్ గురించి తప్పుగా మీరు ఊహించుకోవడం తప్ప.. ఆయనకు పది మందికి పెట్టడం, సహాయం తెలుసు. మీరు చెప్పిన విషయాలకు ఆరడుగులు దూరం ఉంటారు. సహాయం చేయడానికి ఆరడుగులు ముందుకు ఉంటాడు అని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.
సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతీ ఒక్కరికి పవన్ కల్యాణ్ ఏమిటో మాకు తెలుసు. ఎవరో అమ్మాయి మాట్లాడారంటూ.. ఆమె మాటలు పట్టుకొని విమర్శలు చేయడం సరికాదు. అభియోగాలు అందరూ చేస్తారు. అభియోగాలు చేసిన వాటిని నిరూపించాలి కద. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేయవద్దు అని నట్టి కుమార్ హితవు పలికారు.

రాజకీయాలు వేరు, రాజకీయాల్లో మాట్లాడే వాటిని నేను పట్టించుకోను. కానీ ఇలాంటి విషయాలు మాట్లాడితే పవన్ కల్యాణ్ అభిమానులు బాధపడుతారు. నిజమైతే నిరూపించండి. లేకపోతే క్షమాపణ చెప్పాలి. మీకు చెప్పిన వాళ్లను తీసుకొచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. మీకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండొచ్చు. లేదా పొరపాటున మాట్లాడి ఉండొచ్చు అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఘాటుగా నట్టికుమార్ స్పందించారు.


Click it and Unblock the Notifications











