Sankranti Releases మీ కులం వారైతే నాగార్జునకు టికెట్ రేట్లు పెంచుతారా? పోసాని, వైఎస్ జగన్‌పై నిర్మాత ధ్వజం
ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా పోసాని కృష్ణమురళీపై నిర్మాత నట్టి కుమార్ విరుచుకుపడ్డారు. నీలాగ సినిమా పరిశ్రమను అభివృద్ది పథంలో తీసుకెళ్లిన వారెవరూ లేదు అంటూ సెటైర్లపై విరుచుకుపడ్డారు. గతంలో ఏపీలో టికెట్ రేట్లు పెంచకుండా ప్రస్తుతం ఆంధ్రాలో టికెట్ రేట్లు భారీగా పెంచడం వెనుక కులమేనా కారణం అంటూ ఆయన మండిపడ్డారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ఆయన వీడియోలు వైరల్‌గానే కాకుండా చర్చనీయాంశమయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video

నాగార్జున అక్కినేని నటించిన నా సామిరంగ సినిమాకు ఎలా టికెట్ రేట్లు పెంచుతారు? ఆయన సినిమా బడ్జెట్ ఎంత? మీరు పెట్టిన గైడ్ లైన్స్ మీరే తుంగలోకి తొక్కితే ఎలా? 100 కోట్ల బడ్జెట్ దాటాలని మీరే రూల్స్ పెట్టారు? జీఎస్టీ బిల్స్ ఇవ్వాలని మీరే చెప్పారుగా? ఇలాంటి రూల్స్ పెట్టి మీ కులం వారైతే నిబంధనలు సంతృప్తి పరచకపోయినా టికెట్ రేట్లు పెంచుతారా? అని నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు.
భోళా శంకర్, బ్రో సినిమాల బడ్జెట్ 100 కోట్లు దాటినా వాటికి టికెట్ రేట్లు ఎందుకు పెంచలేదు? భగవంత్ కేసరి సినిమాకు టికెట్ రేట్లు ఎందుకు పెంచలేదు. మీ బంధువులైతే ఏమైనా చేస్తారు. అపోజిషన్ పార్టీ అయితే టికెట్ రేట్లు పెంచకపోయినా, ఆ సినిమాను ఆడనివ్వకుండా చేస్తారు. ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీ ప్రభుత్వం? అక్కా చెల్లెలు అని అందర్నీ రోడ్డు మీద పడేస్తారు అని ఆయన ప్రశ్నించారు.
ప్రజల కోసం ఇది చేస్తాం. అది చేస్తాం.. బటన్ నొక్కుతాం అంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులందరూ సమ్మె చేస్తూ రోడ్డపైకి వస్తారు. వైఎస్ఆర్ పాలన ఎక్కడుంది జగన్ మోహన్ రెడ్డి గారు.. ఇది జగన్ పాలన.. ఇది నియంతృత్వ పాలన, హిట్లర్ పాలన అంటారు. సినిమా రంగమే కాదు.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు.

బటన్ నొక్కుతున్నాం. డబ్బులు వేస్తున్నాం అంటారు. కానీ ఎవరి సొమ్ము. అదంతా ప్రజల సొమ్ము. మీరు కాకపోయినా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రభుత్వం ఉంటే వేస్తారు. మీ ఇంటి నుంచి సొమ్ము తీసుకొచ్చి వేయడం లేదు అని ఆయన విమర్శించారు.


Click it and Unblock the Notifications











