పవన్ కళ్యాణ్ ‘పంజా’తో మా లక్ష్యం నెరవేరింది...!?
పవన్ కళ్యాణ్ కి పులి, తీన్ మార్ లాంటి ప్లాపులు వరుసగా రావడంతో ఇక అతని సినిమాలకి పెద్దగా సందడి ఉండదని అనుకున్నారంతా. అయితే పంజాతో ఎప్పటిలాగే మళ్లీ ఫుల్ క్రేజ్ తెచ్చేశాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి హైప్ ఏర్పడ్డానికి, దానిపై అంచనాలు పెరగడానికి ఒక్క స్టిల్ చాలని ఫ్యాన్స్ అంటుంన్నారు. పంజా' చిత్రంలో పవన్ కళ్యాణ్‌ది మాటల కంటే చేతలు ఎక్కువగా వుండే పాత్ర. కోలకతా నేపథ్యంలో చిత్రీకరణ జరిపారు. ఈ పాత్రలోని స్టైల్ అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు.
సముద్రం చూడ్డానికి అల్లకల్లోలంగా కనిపిస్తుంది. కానీ లోపల.... ప్రశాంతంగా ఉంటుంది. ఈ మనిషి కూడా అంతే. పైకి గంభీరంగా, చుట్టుపక్కల ఉన్న సమాజంతో సంబంధం లేని వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ కదిలిస్తే... కాసేపు మాట్లాడితే, స్నేహం చేస్తే... ప్రాణాలివ్వడానికైనా సిద్దమవుతాడు. ఒక్కోసారి మౌనంగా తన పని తాను చేసుకుపొతాడు. మరోసారి మనకు మాట్లాడడానికి అవకాశమే ఇవ్వడు.
ఇంతకీ ఎవరతను? అతని కథేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే "పంజా" సినిమా చూడాల్సిందే. పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. సారాజేన్ డయాస్, అంజలీ లావనియా కథానాయికలు. విష్ణువర్థన్ దర్శకత్వం వహించారు. నీలిమ తిరుమ శెట్టి, శోభు యార్లగడ్డ నిర్మాతలు. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా పతాకాన రూపొందిన 'పంజా'లో బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, జాకీష్రాఫ్, అలీ, అతుల్ కుల్‌కర్ణి, అడవి శేషు, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషించారు. వినోదంతోపాటు యాక్షన్‌ని మేళవించిన 'పంజా' డిసెంబరు 9న విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఇటీవల విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకూ మంచి స్పందన వస్తోంది. పవన్ గాంభీర్యం చూసి ఇదేదో సీరియస్ గా సాగే కథ అనుకోవద్దు. పవన్ శైలి వినోదం కూడా ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మానందంతో ఆయన పండించిన హాస్యం అందరికీ నచ్చుతుంది. పవన్ ని ఓ కొత్త కోణంలో చూపించాలనుకున్న మా లక్ష్యం నెరవేరింద"న్నారు.


Click it and Unblock the Notifications











