రామ్ గోపాల్ వర్మ నిర్మాత...అక్రమ సంభంధం.. భార్య దేహశుద్ది
రామ్ గోపాల్ వర్మతో భూత్ చిత్రం నిర్మించిన నితిన్ మన్మోహన్ తాజాగా ఓ అక్రమ సంభంధం పెట్టుకుని భార్య చేత ఛీ కొట్టించుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. భాఘీ, చల్ మేరా భాయ్, దస్, ఆర్మీ, బోల్ రాధా బోల్ తదితర చిత్రాలు నిర్మించిన బాలీవుడ్ నిర్మాత నితిన్ మన్మోహన్‌పై ఆయన భార్య దాడి చేసింది. 20 ఏళ్ల పైగా సజావుగా సాగిన వీరి సంసారంలో హఠాత్తుగా ఈ ఘటన చోటుచేసుకోవడానికి కారణం.. మన్మోహన్‌కు అక్రమ సంబంధం ఉండటమే. భర్త తీరుపై అనుమానం వచ్చిన డాలీ పంచామియా సినీ ఫక్కీలో ఓ ప్రైవేటు డిటెక్టివ్ ని్ నియమించింది. అతను మన్మోహన్ అక్రమ బంధాన్ని నిర్ధరించడంతో అవాక్కయిన డాలీ భర్తను నిలదీసింది. అతను బుకాయించడంతో ఒళ్లు మండిన ఆమె మన్మోహన్ కు దేహశుద్ధి చేయడమే గాక వారి అపార్ట్ మెంట్ నుంచి 11 అంతస్థుల కిందకు ఈడ్చుకెళ్లింది. అంతటితో ఆగకుండా బెంజ్ కారును ఇటుకరాయితో మోదింది. మన్మోహన్ దంపతుల సన్నిహితులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. గొడవ జరిగిన తర్వాత మన్మోహన్ వేరే అపార్ట్ మెంట్ కు వెళ్లినట్లు సమాచారం. ఇక భూత్ చిత్రం ఊర్మిళ ప్రధాన పాత్రలో చేసిన హర్రర్.


Click it and Unblock the Notifications











