twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సీనియర్ నిర్మాత మృతి

    By Srikanya
    |

    సీనియర్ నిర్మాత పర్వతనేని మల్లిఖార్జున రావు (76)ఈ రోజు మెడ్విన్ హాస్పటిల్ లో మరణించారు. ఆయన తెలుగు, హిందీ బాషల్లో అనేక హిట్ సినిమాలు నిర్మించారు. వయస్సు పెద్దదవటంతో దానికి సంభందించిన కాంప్లికేషన్స్ తో ఆయన మరణించారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

    ఆయన గతంలో కాంతారావు హీరోగా జ్వాలాద్వీప రహస్యం (1965), ఇద్దరు మొనగాళ్లు (1967),అక్కినేనితో మంచి కుటుంబం(1968), శోభన్ బాబుతో మంచి మిత్రులు(1969), ఇంటి గౌరవం (1970), కృష్ణతో నేనంటే నేనే(1968), ఇంటి కోడలు (1974) వంటి అనేక చిత్రాలు నిర్మించారు.

    ఆయన హిందీలోనూ జితేంద్ర హీరోగా హిమ్మత్ (1970),ధర్మేంద్రతో కిమ్మత్(1973),గుల్జార్ దర్సకత్వంలో మౌసమ్,కె విశ్వనాధ్ దర్శకత్వంలో సంజోగ్(1985), ఈశ్వర్ (1989) చిత్రాలు నిర్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు,భార్య ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.

    English summary
    Senior producer Parvathaneni Mallikarjuna Rao (76) has died.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X