twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ నిర్మాత కన్నుమూత

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకొన్నది. కరోనా వ్యాధికి గురైన నిర్మాత పోకూరి రామారావు చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. ఆయన అంత్యక్రియలను శనివారం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాత రామారావు మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పోకూరి రామారావు మరణం గురించి వివరాల్లోకి వెళితే..

    కరోనా సోకడంతో హాస్పిటల్‌లో చేరిక

    కరోనా సోకడంతో హాస్పిటల్‌లో చేరిక

    కొద్ది రోజుల క్రితం పోకూరి బాబూరావు కరోనావైరస్ బారిన పడ్డారు. దాంతో ఆయనను ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చేర్పించారు. అక్కడ శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను వెంటిలేటర్‌పైకి తరలించారు. అయితే ఆయన తన అనారోగ్యం నుంచి కోలుకోలేక శుక్రవారం తుదిశ్వాస విడిచారు అని సన్నిహితులు తెలిపారు.

     పోకూరి రామారావు నిర్మాణ రంగంలోకి

    పోకూరి రామారావు నిర్మాణ రంగంలోకి

    ప్రముఖ నిర్మాత, ఈతరం ఫిలింస్ అధినేత పోకూరి బాబురావుకు రామారావు సోదరుడు. ఈతరం ఫిలిమ్స్‌ బ్యానర్‌లో తీసిన చాలా చిత్రాలకు ఆయన పొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. ప్రొడక్షన్‌ను కంట్రోల్ చేస్తూ నిర్మాత బాబురావుకు చేదోడువాదుడుగా ఉండేవారు. బాబూరావు రూపొందించిన సినిమాలకు పోకిరి రామారావు సమర్పకులుగా వ్యవహరించారు.

    అనుకోకుండా నిర్మాతగా మారి

    అనుకోకుండా నిర్మాతగా మారి

    ఒంగోలుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రోవగుంట గ్రామంలో శేషయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు రామారావు జన్మించాడు. తండ్రి పొగాకు వ్యాపారంలో భాగమయ్యారు. తన సోదరుడు పోకూరి బాబూరావు తీసిన నేటి భారతం సినిమాకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆ సినిమా నిర్మాణానికి ఆర్థికంగా సహాయం అందించారు. పోకూరి బాబూరావు బ్యాంకు ఉద్యోగి కావడంతో నిర్మాతగా పేరు వేయడానికి కొన్ని సమస్యలు రావడంతో రామారావు నేటి భారతం సినిమాకు నిర్మాతగా మారారు.

    నిర్మాణ రంగంలో పాలు పంచుకొన్న చిత్రాలు

    నిర్మాణ రంగంలో పాలు పంచుకొన్న చిత్రాలు

    నేటి భారతం మొదలుకొని రణం, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, యజ్ఞం, అమ్మాయి కోసం, భారతనారి, ఎర్ర మందారం, మా ఆయన బంగారం, ప్రజాస్వామ్యం, అన్న, ఏం పిల్లో ఏం పిల్లడో లాంటి చిత్రాలకు పోకూరి రామారావు పనిచేశారు. ప్రముఖ నటులు మాదాల రంగారావు, దర్శకులు టీ కృష్ణతో మంచి అనుబంధం ఉంది. అభ్యుదయ, విప్లవాత్మక చిత్రాలను రూపొందించడంలో కీలక పాత్రను పోషించారు.

    Recommended Video

    Aha Originals : Bhanumathi Rama Krishna Teaser | ఆహాలో ‘భానుమతి రామకృష్ణ'
     ప్రొడక్షన్ డిజైనింగ్‌లో దిట్ట

    ప్రొడక్షన్ డిజైనింగ్‌లో దిట్ట

    ఆ తర్వాత ఈతరం ఫిలింస్ బ్యానర్‌ను ఏర్పాటు చేసి పోకూరి బాబూరావు పూర్తిస్థాయి నిర్మాతగా మారిన తర్వాత తన సోదరుడితో కలిసి రామారావు సినీ జీవితాన్ని కొనసాగించారు. ఈతరం ఫిలింస్‌లో రూపొందిన సినిమాలన్నింటికి ప్రొడక్షన్ డిజైనల్‌లో కీలక పాత్రను పోషించారు. అభ్యుదయ భావాలతో ఆయన తన జీవితాన్ని కొనసాగించారు. ఆయన మరణం నేపథ్యంలో ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు ప్రార్థించారు.

    English summary
    Eetaram film banners partner, Producer Pokuri Rama Rao died with coronavirus on June 6th. Many celebraties of Tollywood mourns for his death. His last rites will perform on Saturday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X