twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత పీవీపీ నిర్వాకంపై మరో కేసు.. అరెస్ట్ కోసం వెళితే.. పోలీసులపై కుక్కలను ఉసిగొల్పిన వైసీపీ నేత

    |

    ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీపై మరో కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం తనపై దాడి చేశారంటూ పీవీపీపై బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్ 82లోనో ఓ ఇంటి యజమాని విక్రమ్ కైలాస్ ఫిర్యాదు చేయడం తెలిసిందే. భూవివాదంపై గొడవలో తనను వేధిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్లిన పీవీపీ దురుసుగా ప్రవర్తించడం పోలీసుల ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలో ఆయనపై మరో కేసును నమోదు చేయడం సంచలనంగా మారింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    భూ వివాదం వ్యవహారంలో పీవీపీపై కేసు

    భూ వివాదం వ్యవహారంలో పీవీపీపై కేసు

    సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లోని రోడ్ నంబర్ 14లో ప్రేమ్ పర్వత్ విల్లాస్ అనే పేరిట భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఆ నిర్మాణాల్లోని ఓ విల్లాను విక్రమ్ కైలాస్ అనే వ్యక్తికి కొద్ది నెలల క్రితం కొనుగోలు చేశారు. అయితే ఆ విల్లాకు సంబంధించిన నిర్మాణాల్లో భాగంగా వివాదం చోటేచేసుకోవడం.. ఆ తర్వాత పీవీపీ అనుచరులు దాడి చేయడం జరిగింది.

    దాడి చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు

    దాడి చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు

    తనపై దాడి చేశారంటూ విక్రమ్ కైలాస్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి ఆ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ కేసులో ఆయనను విచారించేందుకు పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరితే హాజరుకాకపోవడంతో సోమవారం జూన్ 29న స్వయంగా పోలీసులే వెళ్లారు.

    అరెస్ట్ చేయడానికి వెళితే..

    అరెస్ట్ చేయడానికి వెళితే..

    మీడియా కథనాల ప్రకారం.. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్స్‌పెక్టర్ హరీష్ రెడ్డి సోమవారం తన బృందంతో పీవీపీని విచారించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా పోలీసు సిబ్బందిపై తన పెంపుడు కుక్కలను ఉసికోల్పడం జరిగింది. దాంతో భయాందోళనకు లోనైన పోలీసులు వెనకకు వచ్చారు అని వెల్లడించారు.

    పోలీసులపైకి కుక్కలను ఉసిగొల్పుతూ

    పోలీసులపైకి కుక్కలను ఉసిగొల్పుతూ


    కేసు విచారణలో భాగంగా అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై కుక్కలను ఉసిగొల్పుతూ పీవీపీ చేసిన నిర్వాకంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విధి నిర్వాహణలో ఉన్న పోలీసు సిబ్బంది ప్రాణాలకు ఆపాయం తలపెట్టే విధంగా చేశారంటూ ఆయనపై మరో కేసును కూడా సోమవారం నమోదు చేశారు.

    Recommended Video

    PVP Gives Police Complaint On Bandla Ganesh || టెంపర్ సినిమా వల్లే..!!
    పీవీపీపై పోలీసుల కేసు

    పీవీపీపై పోలీసుల కేసు

    విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకొనేందుకు ప్రయత్నించడమే కాకుండా, ప్రాణాలకు అపాయం తలపెట్టే విధంగా వ్యవహరించారు అని పీవీపీపై సబ్ ఇన్స్‌పెకట్ర్ హరీష్ రెడ్డి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయనపై ఐపీసీ 353 ప్రకారం కేసు పెట్టినట్టు తెలిసింది. ఈ ఘటన జూబ్లి హిల్స్‌లోని రోడ్డు నంబర్‌లో ఉన్న పీవీపీ నివాసం వద్ద జరిగింది.

    Read more about: pvp tollywood ysrcp
    English summary
    YSRCP leader Potluri Varaprasad alias PVP booked in another case. Polices filed a case for unleashing dogs at a police team. Banjara Hills Sub Inspector Harish Reddy has lodged a complaint against PVP under IPC 35
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X