అనుష్క, తమన్నా, సమంత ఇలా ఎందరో.. శృతి హాసన్‌దే తప్పు.. నిర్మాత హాట్ కామెంట్స్!

Recommended Video

Producer Prasad V. Potluri Responds On Kesineni Nani Comments || Filmibeat Telugu

విజయవాడ వైసిపి ఎంపీ అభ్యర్థిగా సినీ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఎవరొచ్చినా విమర్శలు ఎదుర్కొనవలసిందే. టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పీవీపీపై సంచలన ఆరోపణలు చేశాడు. పీవీపీ వల్ల చాలా మంది సినీ ప్రముఖులు ఇబ్బంది పడ్డారని, అతడొక క్రిమినల్ అంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. కేశినేని నాని మాట్లాడుతూ పీవీపీ, శృతి హాసన్ మధ్య జరిగిన గురించి హాట్ కామెంట్స్ చేశాడు. నాని వ్యాఖ్యలపై తాజాగా పీవీపీ స్పందించారు.

హీరోయిన్లని వేధించాడు

హీరోయిన్లని వేధించాడు

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు, నటులు పీవీపీ వలన ఇబ్బంది పడ్డారని నాని ఆరోపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుని మాత్రం పివిపి లొంగదీసుకోలేకపోయాడు. పీవీపీ ఎన్నో నేరాలకు పాల్పడ్డాడని, అతడొక క్రిమినల్ అంటూ వ్యాఖ్యానించారు. ఊపిరి చిత్ర సమయంలో పీవిపీ, శృతి హాసన్ వివాదం హాట్ టాపిక్ గా నిలిచింది. తాజాగా పీవీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ నాని వ్యాఖ్యలపై స్పందించాడు.

షూటింగ్ మధ్యలో

షూటింగ్ మధ్యలో

వంశీ పైడిపల్లి దర్శత్వంలో నాగార్జున, కార్తీ కలసి నటించిన ఊపిరి చిత్రం 2016లో విడుదలయింది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. పీవీపీ నిర్మాణంలో వచ్చిన ఊపిరి చిత్రం మంచి విజయం సాధించింది. ఊపిరి షూటింగ్ మధ్యలో శృతి హాసన్ వెళ్ళిపోయింది. అందుకే డబ్బు వెనక్కి తీసుకున్నాం ఇందులో తప్పేముంది అని పివిపి క్లారిటీ ఇచ్చారు. తాను చిత్ర పరిశ్రమలో ఎదో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పివిపి అన్నారు.

ఎందరో నటించారు

ఎందరో నటించారు

కేశినేని నాని తాను హీరోయిన్లని ఇబ్బంది పెట్టినట్లు ఆరోపిస్తున్నారు. మా బ్యానర్ లో అనుష్క, సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఎందరో నటించారు. ఎవరూ నాపై ఆరోపణలు చేయలేదు. కేశినేని నాని ఇలాంటి అసత్య ప్రచారాలు సృష్టించడం మానాలి. పీవీపీ నిర్మాణంలో ఘాజి, ఊపిరి లాంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.

నిర్మాతగా

నిర్మాతగా

పివిపి ఓవైపు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూనే నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. పివిపి ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో బ్రాహ్మోత్సవం చిత్రం వచ్చింది. మహర్షి చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్, పివిపి కలసి నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X