twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇద్దరు దర్శకులపై పీవీపీ సంచలన వ్యాఖ్యలు.. మహేశ్ వాళ్ల హీరోనే అంటూ కామెంట్స్

    |

    ప్రసాద్‌ వి పొట్లూరి (పీవీపీ).. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. వ్యాపార వేత్తగా ఎన్నో శిఖరాలను అధిరోహించిన పీవీపీ.. తర్వాత సినిమా రంగం వైపు వచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలను నిర్మించి బడా ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంటరై ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఒకవైపు వ్యాపారవేత్తగా, మరోవైపు ప్రొడ్యూస్ కమ్ పొలిటీషియన్‌గా సాగుతున్న పీవీపీ తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఎన్నో విషయాలు పంచుకున్నారు.

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

    ప్రసాద్‌ వి పొట్లూరి (పీవీపీ) ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేశినేని నాని చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాతి నుంచి ఆయన సోషల్ మీడియా వేదికగా తరచూ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారాయన.

    దర్శకులపై సంచలన వ్యాఖ్యలు

    దర్శకులపై సంచలన వ్యాఖ్యలు

    పీవీపీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇద్దరు దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన దక్షిణాదిలోని ఇద్దరు ప్రముఖ దర్శకులు నిర్మాతలు సెట్‌కు రాకూడదనే కండీషన్ పెట్టారు. నేను వాళ్ల పేర్లు చెప్పను. వారు మన పక్క రాష్ట్రాల్లో ఉన్నారు. దర్శకులకు డిమాండ్‌ ఉంది. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులు వారి వళ్లే సాధ్యం అవుతాయి. వారిని విమర్శించలేం. నిర్మాతలకు మరోదారి లేదు' అని ఆయన చెప్పుకొచ్చారు.

    స్క్రిప్ట్ లేకుండానే మొదలెడుతున్నారు

    స్క్రిప్ట్ లేకుండానే మొదలెడుతున్నారు

    అలాగే, కొందరు దర్శకుల తీరును ఈ సందర్భంగా ఆయన తప్పుబట్టారు. ‘సినిమా అనేది ఎప్పుడూ దర్శకులపై ఆధారపడి ఉంటుంది. దర్శకుడు అందరితో కలిసి పనిచేస్తే అవుట్‌పుట్‌ ఇంకా బాగా వస్తుంది. నిర్మాతలు రూ. కోట్లు పెడుతుంటే.. కొందరు దర్శకులు స్క్రిప్టు పూర్తి కాకుండానే సెట్స్‌పైకి వెళ్తుంటారు. అలాంటి వారి వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తుంటాయి. అయినా చాలా మంది ఈ విషయంలో జాగ్రత్త పడడంలేదు' అని తెలిపారు.

    మహేశ్ బాబు సినిమాపైనా కామెంట్స్

    మహేశ్ బాబు సినిమాపైనా కామెంట్స్

    ఇదే ఇంటర్వ్యూలో మహేశ్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం' సినిమా పైనా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో పంపిణీ దారులకు తిరిగి డబ్బులు వెనక్కి ఇచ్చాం. ఈ సినిమా వైఫల్యానికి హీరో మహేశ్‌బాబును విమర్శించలేం. ఎందుకంటే ఆయన ఎప్పుడూ దర్శకుల హీరో. అవసరమైతే ఒక సీన్‌ను పది సార్లు చేస్తుంటారు. ఇది ఎవరి పొరపాటు అన్నది విషయం కాదు' అని పీవీపీ పేర్కొన్నారు.

    ఈ ఏడాది రెండు విజయాలు

    ఈ ఏడాది రెండు విజయాలు

    పీవీపీ ఈ ఏడాది రెండు విజయాలను సొంతం చేసుకున్నారు. మహేష్ 25వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి'కి ఆయన సహ నిర్మాతగా వ్యవహరించగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే, సక్సెస్‌ఫుల్ హీరో అడివి శేషు నటించిన ‘ఎవరు' చిత్రాన్ని పీవీపీ నిర్మించారు. రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది.

    English summary
    Potluri Vara Prasad popularly known as "PVP" is a serial entrepreneur, philanthropist and educationalist. He started his own production company called PVP cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X