బాలయ్యని అనే స్థాయి నాగబాబుకు ఉందా.. అద్దం ముందు నిలబడి, వరుణ్ తేజ్‌పై ఎఫెక్ట్!
Recommended Video

నందమూరి బాలకృష్ణపై మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బాలయ్య అంటే ఎవరో తెలియదు అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ లో పెద్ద చర్చే జరిగింది. నాగబాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు. ఈ వివాదంపై నాగబాబే క్లారిటీ ఇచ్చారు. గతంలో బాలయ్య తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు అని, మరి కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. దానికి కౌంటర్ గానే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు నాగబాబు తెలిపారు. నాగబాబు, బాలయ్య వివాదంపై ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాగబాబుకు ఆ స్థాయి లేదు
తనకు ఓ ఇంటర్వ్యూలో ఎదురైనా ప్రశ్నకు నిర్మాత ప్రసన్న కుమార్ సమాధానం ఇస్తూ నాగబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు దీనిని బాలయ్య, నాగబాబు మధ్య వివాదంగా పరిగణించకూడదు అని ప్రసన్న కుమార్ అన్నారు. చిరంజీవి, బాలయ్య సమ ఉజ్జీలు. వారిద్దరిని పోల్చి చూడవచ్చు. కానీ నాగబాబుని, బాలయ్యని పోల్చడం ఏంటి. బాలయ్యకు నాగబాబుని అనే స్థాయి ఉందా అని ప్రసన్న కుమార్ ప్రశ్నించారు.

చిరు, బాలయ్య స్నేహితులు
చిరంజీవి, బాలయ్యే మంచి స్నేహంగా ఉన్నారు. ఇక నాగబాబుకు ఎందుకు ఈ గొడవ. బాలయ్య నంది అవార్డుల కమిటీలో సభ్యుడు. ఆ కమిటీనే చిరంజీవి రఘుపతి వెంకయ్య అవార్డుని చిరంజీవికి ప్రకటించింది అని ప్రసన్న కుమార్ గుర్తు చేశారు. చిరంజీవి, బాలయ్య మధ్య మంచి రిలేషన్ ఉందనడానికి ఇదే నిదర్శనం అని ప్రసన్న కుమార్ వ్యాఖ్యానించారు. వారిద్దరూ ఒకరి కార్యక్రమాలకు మరొకరు వెళుతూ బాగానే ఉన్నారు.

బాలయ్య తెలియకపోవడం ఏంటి
నాగబాబు మా అసోసియేషన్‌లో వైస్ ప్రెసిడింట్‌గా చేశారు. అదే అసోసియేషన్‌లో బాలయ్య ఒక స్టార్‌గా, సభ్యుడిగా ఉన్నారు. కానీ బాలయ్య ఎవరో తెలియదు అని చెప్పడం ఏంటి. తాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో అని నాగబాబు ఒకసారి అద్దం ముందు నిలబడి తనని తాను ప్రశ్నించుకోవాలి అని ప్రసన్న కుమార్ వ్యాఖ్యానించారు. ఇలా ప్రవర్తించడం ఏంటనే నాగబాబు విచక్షణకే వదిలేయాలని తెలిపారు.

వరుణ్ తేజ్‌పై ఎఫెక్ట్
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. తన కొడుకు చిత్రాలు అందరు హీరోల అభిమానులు చూడాలని కోరుకోవాలి. నాగబాబు ఇలా ప్రవర్తించడం వలన వరుణ్ తేజ్‌పై ఎఫెక్ట్ పడుతుందని ప్రసన్న కుమార్ అన్నారు. కొందరు హీరోల అభిమానులు బాయ్ కాట్ చేసే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని నాగబాబు గమనించాలని కోరారు. ఇండస్ట్రీ అంతా బావున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని ప్రసన్న కుమార్ తెలిపారు.


Click it and Unblock the Notifications











