»   »  చెన్నై వరదలు: నిర్మాత లక్ష, సంపూ 50 వేలు సాయం

చెన్నై వరదలు: నిర్మాత లక్ష, సంపూ 50 వేలు సాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎల్లప్పుడూ తన వంతు ఏదో సహాయం చేస్తూ కొందరికి బరోసా కల్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు నిర్మాత ప్రతాప్ కోలగట్ల(3జి లవ్). ఇక గతం లో వైజాగ్ హూద్ హూద్ తుఫాన్ భాధితుల సహాయార్ధం 1లక్ష విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి అందించారు ప్రతాప్.

 Producer Pratap and Sampoo donates for Chennai

ఇక సూర్య, విశాల్ వంటి తమిళ నటులు మన వైజాగ్ హుడ్ హుడ్ తుఫాన్ కి స్పందించి లక్షల రూపాయిల విరాళం అందించారు. ఇప్పుడు అలాంటి విప్పత్తే చెన్నై ని తాకింది. ఈ సమయం లో మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి స్పందించి సాయం అందించాల్సిన సమయం వచ్చింది. నా వంతుగా రూ.1.00,000 అందిస్తున్నాను. అని నిర్మాత ప్రతాప్ కోలగట్ల ప్రకటించారు.. అతి త్వరలో ముఖ్య మంత్రి జయలలిత గారికి కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని తెలిపారు. తన బాటలోనే మన తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన మరి కొందరు ముందుకు వచ్చి సహాయం అందించాలని తన ఆశా భావాన్ని వ్యక్త పరిచారు.

 Producer Pratap and Sampoo donates for Chennai

సంపూర్ణేష్ బాబు...
గతం లో వైజాగ్ హుడ్ హుడ్ తుఫాను సమయం లో సూర్య వంటి తమిళ నటులు స్పందించి లక్షల రూపాయిల విరాళం అందించారు.....ఇప్పుడు అలాంటి విప్పత్తే చెన్నై ని తాకింది. ఈ సమయం లో తోటి తెలుగు నటులు స్పందించి సాయం అందించాల్సిన సమయం వచ్చింది. నా వంతుగా రూ.50,౦౦౦ అందిస్తున్నాను. వెంటనే తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత గారికి కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని సంపూర్నేష్ బాబు తెలిపారు.

English summary
Producer Pratap and Sampoornesh Babu donation for Chennai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu