మహేష్ బాబుకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాను: ‘మహర్షి’ నిర్మాత పివిపి
Recommended Video
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ వి పొట్లూరి(పివిపి) విజయవాడలోని తన పివిపి మాల్‌లో ప్రజలతో కలిసి సినిమా చూశారు.
'మహర్షి' మూవీ చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''ఇది మహేష్ బాబు గారికి 25వ సినిమా. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. నా సంస్థకైనా, దిల్ రాజు సంస్థకైనా, అశ్వినీ దత్ సంస్థకైనా బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే'' అని తెలిపారు.

అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది
యూఎస్ఏ, దుబాయ్ ఇలా అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. సమ్మర్ మొత్తానికి 10 కోట్ల మంది తెలుగు వారు ఎక్కడ చూడాలన్నా ‘మహర్షి' మూవీనే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అన్ని థియేటర్లలో ‘మహర్షి' మూవీ ప్రదర్శితం అవుతోంది అని పివిపి చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు కెరీర్లో ఇంతకన్నా గుడ్ లుకింగ్ ఫిల్మ్ ఉండదు
‘ఊపిరి' మా సంస్థకు బాగా పేరు తెచ్చిన మూవీ. ఈ మూవీ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మూడేళ్ల క్రితం మహేష్ బాబుకు ఈ స్టోరీ చెప్పించాను. ఆ తర్వాత ఇద్దరు నిర్మాత దిల్ రాజు, అశ్వినీదత్ జాయిన్ అయ్యారు. మహేష్ బాబు కెరీర్లో ‘మహర్షి' కన్నా గుడ్ లుకింగ్ ఫిల్మ్ ఉండదు, ఇంతకంటే బడ్జెట్ ఫిల్మ్ ఉండదని అనుకుంటున్నాను.... అని పివిపి వ్యాఖ్యానించారు.

మహేష్ బాబుకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాను
‘‘వారం క్రితం ‘మహర్షి' మూవీ చూసిన అనంతరం మహేష్ బాబుకు ఫోన్ చేశాను. మీకొక బ్యాడ్ న్యూస్ ఉంది అనగానే కంగారు పడ్డారు. ఏంటా బ్యాన్ న్యూస్ అని అడిగారు. ఇంతకన్నా పీక్ మీరు దాటలేరు.. అదే బ్యాడ్ న్యూస్ అన్నాను. ఇది మీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. అది గుడ్ న్యూస్ అని చెప్పాను.'' అని పివిపి గుర్తు చేసుకున్నారు.

‘ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నా
‘‘ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాను. వండ్‌ఫుల్ ట్రీట్ అండ్ డిలైట్, ఫీల్ గుడ్ ఫిల్మ్. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది.'' అని పివిపి చెప్పుకొచ్చారు.

మహర్షి
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











