బండ్ల గణేష్ అరెస్ట్‌పై పీవీపీ కామెంట్.. ఆదుకొనే వాడుండడు.. చితికిపోతాడు!
టెంపర్ సినిమా వివాదం నిర్మాతలు బండ్ల గణేష్, పీవీపీ మధ్య భారీ వివాదాన్ని రాజేసింది. సినిమా ఆర్థిక వ్యవహారాలు విషయం నేపథ్యంలో పీపీపీ చేసిన ఫిర్యాదు మేరకు బండ్ల గణేష్‌ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించాడు. ఆయన అరెస్ట్‌పై ఓ మీడియాతో మాట్లాడుతూ.. చెక్ బౌన్స్, ఆర్థిక వ్యవహారాలు, బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ అంశంపై వీపీపీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.

టెంపర్ కోసం 30 కోట్లు ఇస్తే
సినిమా వ్యాపారంలో వివాదాలు సర్వసాధారణం. కానీ నిర్మా బండ్ల గణేష్ విషయంలో ఎదురైన వివాదం మాకు ఇబ్బంది కలిగించింది. టెంపర్ సినిమా కోసం రూ.30 కోట్లు ఫైనాన్స్ చేశాం. 23 కోట్లు వెనుకకు తిరిగి ఇచ్చారు. 7 కోట్లు ఇంకా ఇవ్వాల్సి ఉంది. బ్లాంక్ చెక్కులు ఇచ్చారు కానీ ఐదేళ్లు గడిచినా తిరిగి చెల్లించలేదు. మేము ఆయనకు నోటీసులు పంపించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనుకొన్నాం అని నిర్మాత పీవీపీ అన్నారు.

మాపై పోలీసు కేసు
కోర్టు కేసుల్లో భాగంగా మాతో చర్చలు జరిపేందుకు ముగ్గురు మనుషులను పంపించాడు. అదే సమయంలో బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. ఆయనపై 58 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. మా మీద ఒక్క చెక్ బౌన్స్ కేసులు లేవు. వందల మంది వద్ద డబ్బులు తీసుకొన్నాడు. నాకు ఏడు కోట్లు ఎప్పటికైనా వడ్డీతో సహా కట్టాల్సిందే. ఈ క్రమంలో మా ఫిర్యాదు మేరకు అరెస్ట్ అయ్యాడు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని పీవీపీ పేర్కొన్నారు.

బొత్సతో మాకు సంబంధం లేదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణకు బండ్ల గణేష్ బినామీ అనే విషయం నాకు తెలియదు. ఆ విషయంపై మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ఈ వివాదంలో బొత్స నాతో మాట్లాడలేదు. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని పీవీపీ తెలిపారు.

బ్రహ్మోత్సవం ప్లాప్ అయితే
బ్రహ్మోత్సవం సినిమా ప్లాఫ్‌పై పీవీపీ స్పందించారు. తండ్రి కొడుకుల ఎమోషనల్ కథను చెప్పాడు. మహేష్ బాబుకు బాగా నచ్చింది. అయితే కథ అనుకొన్నట్టు తెర మీద ప్రొజెక్ట్ కాలేదు. దాంతో సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. ఏ సినిమా హిట్టయినా దర్శకుడిదే బాధ్యత. ఆ విషయంలో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని పీవీపీ వెల్లడించారు.

ఆదుకొనే ఉండడు..
సినిమా ఆడకపోతే దర్శకుడు కెరీర్ పరంగా నష్టపోతాడు. నిర్మాత డబ్బుల పరంగా చితికిపోతాడు. ప్రొడ్యూసర్ లాస్ అయితే ఆదుకొనే వాడు ఉండడు. దర్శకుడు మరో నిర్మాతతో సినిమా చేస్తాడు. కానీ బ్రహ్మాస్త్రం విషయంలో మాకు ఆర్థికంగా నష్టం రాలేదు. 5 కోట్లు లాభం వచ్చింది. అయితే నష్టపోయిన వారికి ఆ మొత్తాన్ని వెనుకకు ఇచ్చాం. ఆ తర్వాత మా ఐదు సినిమాలు వారికి ఇచ్చి వారిని ఆదుకొన్నాం అని పీవీపీ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











