twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: 'ఆ కొడుకుల కుత్తుకలు కోయాలి'.. విమర్శకులపై నిర్మాత పీవీపీ సంచలన వ్యాఖ్యలు

    |

    కేవలం తెలుగు ప్రేక్షకులకు కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా ప్రతిష్టాత్మక చిత్రం RRR విడుదలైంది. మార్చి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు నిర్మాతలు.. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మొట్ట మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. అయితే కొంత మంది మాత్రం రాజమౌళి సినిమా సరిగ్గా చేయలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారి మీద నిర్మాత పొట్లూరి వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

     భారీ బడ్జెట్తో

    భారీ బడ్జెట్తో

    భారతదేశ సినీ చరిత్రలో మొట్ట మొదటిసారిగా 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రాజమౌళి RRR అనే ఒక అద్భుత దృశ్య కావ్యాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. ఇక వారి సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ నటించారు

    బాగాలేదు అని

    బాగాలేదు అని


    రామ్ చరణ్ తండ్రిగా అజయ్ దేవగన్ తల్లిగా శ్రేయ నటించారు. రాజీవ్ కనకాల, చత్రపతి శేఖర్, రాహుల్ రామకృష్ణ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా దాదాపు అందరికీ నచ్చిన సరే కొంతమంది మాత్రం సినిమా బాగాలేదు అని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

     నెగిటివ్ కామెంట్స్

    నెగిటివ్ కామెంట్స్


    ఫ్యాన్స్ సినిమా రేటింగ్‌ను అమాంతం పెంచేసి చెబుతుంటే కొందరు మాత్రం కావాలని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని చూసి.. గర్వించకుండా చౌకబారు విమర్శలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారిపై సంచలనం కామెంట్లు చేశారు ప్రముఖ నిర్మాత పీవీపీ. కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

    గర్వపడిండి రా కొడకల్లారా

    గర్వపడిండి రా కొడకల్లారా


    "జాతి గర్వించే కథలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి..మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మన వాడని ఆనంద పడాలి. నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు.. కాస్త తెలుగోడిగా, గర్వపడిండి రా కొడకల్లారా.. Respect freedom of speech, but there is a fine line of agenda and objective views !'' అని పీవీపీ పేర్కొన్నారు.

    గర్వపడిండి రా కొడకల్లారా

    "జాతి గర్వించే కథలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి..మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మన వాడని ఆనంద పడాలి. నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు.. కాస్త తెలుగోడిగా, గర్వపడిండి రా కొడకల్లారా.. Respect freedom of speech, but there is a fine line of agenda and objective views !'' అని పీవీపీ పేర్కొన్నారు.

    English summary
    Producer PVP Sensational Comments on RRR Movie negative commenters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X