‘తేజ్ ఐ లవ్ యూ’.. ఎలా ఉందో నిర్మొహమాటంగా చెప్పిన రాజ్ కందుకూరి!

By Bojja Kumar

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మించిన చిత్రం 'తేజ్‌'... ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా నేడు గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి యావరేజ్ రేటింగ్స్ సొంతం చేసుకుంది. తెలుగు నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమా చూసిన అనంతరం తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సినిమా ఎలా ఉందో నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Recommended Video

Tej I Love U Movie Public Talk తేజ్ తేజ్ ఐ లవ్ యు పబ్లిక్ టాక్
ఇది కంప్లయింట్ కాదు... కానీ ఇంకా మోడ్రన్‌గా తీసుండొచ్చు

ఇది కంప్లయింట్ కాదు... కానీ ఇంకా మోడ్రన్‌గా తీసుండొచ్చు

శుక్రవారం ఉదయం ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్ వద్ద తనకు ఎదురైన మీడియా వారితో తన అభిప్రాయాలు పంచుకున్నారు. కథా పరంగా చెప్పాలంటే.. మనం ఇంతకు ముందు చూసిన కథలాగే ఉందని రాజ్ కందూరి తెలిపారు. సినిమా కరుణాకరన్ స్టైల్‌లో ఉందనిపించిందా? పాత స్టైల్ లో ఉందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ సినిమా స్టైల్ ఓల్డ్‌గానే ఉంది. ఇంకొంత మోడ్రన్ మేకింగ్ చేసి ఉండి ఉంటే బావుండేది... ఇది కంప్లయింట్ కాదు కానీ, ఇంకా చేసి ఉండొచ్చు అన్నారు.

తేజ్ అభిమానులు నచ్చుతుంది

తేజ్ అభిమానులు నచ్చుతుంది

సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ కోసం ‘తేజ ఐ లవ్ యూ' సినిమా చూడొచ్చు. అనుపమ పరమేశ్వరన్ చాలా బాగా నటించింది. తేజ్ అభిమానులకు బాగా నచ్చుతుందని ఈ సందర్భంగా రాజ్ కందుకూరి స్పష్టం చేశారు.

బాగా హైలెట్ అయిన అంశాలు అవే

బాగా హైలెట్ అయిన అంశాలు అవే

సినిమా కాస్టూమ్స్, లొకేషన్స్ పరంగా బావుంది. మ్యూజిక్ పరంగా రెండు పాటలు చాలా బావున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. అనుపమ-తేజ్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది... అని రాజ్ కందుకూరి తెలిపారు.

తేజ్‌కు మంచి హిట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

తేజ్‌కు మంచి హిట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

సినిమా యావరేజా? ప్లాపా? అనే అంశంపై స్పందిస్తూ..... యావరేజ్ అవుతుందేమో? నాకు తెలియదు. హిట్ కొట్టాలని అనుకుంటున్నాను. చాలా కష్టపడి యాక్ట్ చేసే హీరోల్లో తేజ్ ఒకరు. వండర్ ఫుల్ హ్యూమన్ బీయింగ్, మంచి హిట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని రాజ్ కందుకూరి ఆకాంక్షించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X