twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుల బాధతో ప్రొడ్యూసర్ ఆత్మహత్య

    By Bojja Kumar
    |

    బెంగుళూరు: అప్పులు బాధతో కన్నడ సినీ నిర్మాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగుళూరులో ఈ నెల 29న చోటు చేసుకుంది. అతని పేరు రాకేష్ జైన్. కన్నడ చిత్రం 'అనార్కలి' నిర్మాత. బళ్లారిలో మైనింగ్ బిజినెస్ చేసే రాకేష్ జైన్(41) కొన్ని రోజుల క్రితమే సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు.

    బిజినెస్ లాస్‌తో పాటు సినిమా రంగంలో కూడా కలిసి రాక పోవడంతో దాదాపు రూ. 20 కోట్ల మేర అప్పుల్లో కూరుకు పోయాడు. కొంత కాలంగా అప్పుఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో మనో వేధనకు గురైన రాకేష్ తనువు చాలించాడు. కుటుంబ సభ్యులు బళ్లారిలోనే ఉంటుండగా....రాకేష్ జైన్ మాత్రం బెంగుళూరులో ఉంటున్నాడు. పోస్టు మాత్రం అనంతరం రాకేష్ మృత దేహాన్ని అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని బెంగుళూరు పోలీసులు తెలిపారు.

    రాకేష్ జైన్ నిర్మిస్తున్న కన్నడ చిత్రం 'అనార్కలి' 2011లో ప్రారంభం అయింది. సింగర్ కిట్టీ, రమ్య భార్నా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ చిత్రం కొంత కాలంగా ముందుకు సాగడం లేదు. నిర్మాత మృతితో ఈచిత్రం ఇక నిలిచి పోయినట్లే.

    English summary
    Producer Rakesh Jain, who was making Kannada movie Anarkali directed by Sadhu Kokila, committed suicide at his residence in Amruthanagar, Bangalore on August 29. He took his life unable to cope with the burden of loans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X