twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమరణదీక్ష: ఆ ఐదుగురి వల్లే టాలీవుడ్ నష్టపోతోంది!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బుధవారంతో ఆయన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ థియేటర్ల లీజు విధానం వల్ల ఇతర నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు.

    పరిశ్రమలోని ఐదుగురు పెద్ద నిర్మాతలు లీజు పేరుతో థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, థియేటర్లకు, నిర్మాతలకు మధ్య దళారుల్లా వ్యవహరిస్తున్నారని...వారి వల్ల చిన్న నిర్మాతలు సినిమాలు విడుదల చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వీరు ప్రభుత్వానికి 30 శాతం పన్ను కూడా కట్టం లేదన్నారు. వెంటనే థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలని, అప్పటి వరకు నా ప్రాణం పోయినా దీక్ష విరమించేది లేదన్నారు.

    Producer Ramakrishna goud fast protest

    లీజు విధానం రద్దు చేయడంతో పాటు ఫిలించాంబర్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఆర్కే గౌడ్ డిమాండ్ చేశారు. ఆర్కే గౌడ్‌కు పలువురు నిర్మాతలు మద్దతు ప్రకటించారు.

    English summary
    Producer Ramakrishna goud fast protest at AP film chamber against theaters lease system.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X