For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రేప్ ఎటాక్ జరిగింది, 5 బ్రేకప్స్, ఐటం అన్నారు, నైట్‌కు ఇంత అని రేటుకట్టారు: ‘ఫిదా’ ఫేం గాయిత్రి

  By Bojja Kumar
  |
  నైట్‌కు ఇంత అని రేటుకట్టారు ! -‘ఫిదా’ ఫేం గాయిత్రి

  తనపై రేప్ ఎటాక్ జరిగినట్లు 'ఫిదా' ఫేం గాయిత్రి గుప్తా వెల్లడించారు. హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే తాను ఇలాంటి సంఘటన ఎదుర్కొన్నట్లు ఇటీవల ఓ వెబ్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఇంకొక అమ్మాయికి రాకుండా నేను ఏదైనా చేయాలని ఆలోచించానని గాయిత్రి తెలిపారు. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలను వదిలేయకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు.

  రేప్ ఎటాక్ జరిగినపుడు నేను భయపడ్డాను. ఇంట్లో చెబితే ఇండస్ట్రీని కెరీర్ గా ఎంచుకున్నావు కాబట్టే ఇలా జరిగిందని చెప్పి హౌస్ అరెస్ట్ చేస్తారు. అందుకే ఇంట్లో చెప్పలేదు. ఒకరోజు ఎమోషనల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యాను.... అని తెలిపారు.

   నువ్వు వీక్ గా కనిపించక పోతే అలాంటి పరిస్థితి ఉండుదు కదా

  నువ్వు వీక్ గా కనిపించక పోతే అలాంటి పరిస్థితి ఉండుదు కదా

  చాలా మంది అమ్మాయిలను చూశాను. రేప్ అయినా, రేప్ ఎటాక్ అయినా జరిగితే చాలా నెలలు, సంవత్సరాలు డిప్రెషన్లో ఉండి పోయి లైఫ్ లో ఏదో జరుగకూడనిది జరిగిపోయింది అని డిప్రెస్ అయిపోతుంటారు. ఒక రేప్ ఎటాక్ అయినా, దెబ్బలు తగలడం అయినా అది వే ఆఫ్ షోయింగ్ డామినేషన్. ఉదాహరణకు వీకర్ మీద స్ట్రాంగ్ డామినేట్ చేయడం. పులి ఒక కుందేలును చంపుతుందే కానీ ఇంకో పులిని చంపదు. ఎందుకు అంటే నువ్వు వీక్ ఉన్నావు అని డిసైడ్ అయిపోయింది కాబట్టి నీ మీద డామినేట్ చేస్తుంది. నువ్వు వీక్ గా కనిపించక పోతే అలాంటి పరిస్థితి ఉండుదు కదా అని గాయిత్రి తెలిపారు.

   నా దగ్గర కంప్లయింట్ ఇవ్వడానికి ఎలాంటి ఆధారం లేదు

  నా దగ్గర కంప్లయింట్ ఇవ్వడానికి ఎలాంటి ఆధారం లేదు

  రేప్ ఎటాక్ జరిగినపుడు మీరు ఎవరికీ కంప్లయింట్ ఇవ్వలేదా? అనే ప్రశ్నకు గాయిత్రి స్పందిస్తూ.... నా దగ్గర కంప్లయింట్ ఇవ్వడానికి ఎలాంటి ఆధారం లేదు. అలాంటి లేనపుడు మనం ఏం చేసినా లాభం ఉండదు. అపుడు నాకు కంప్లయింట్ ఇద్దామనేంత దైర్యం కూడా లేదు. మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకున్నట్లు అనే సామెత ఉంది... అది అప్పుడప్పుడు నిజం అనిపిస్తుంది అని గాయిత్రి వ్యాఖ్యానించారు.

   చీప్ అయిపోతామనే భయం

  చీప్ అయిపోతామనే భయం

  ఇది కేవలం ఒక్క నా విషషయంలోనే కాదు. చాలా మంది విషయంలో ఇలాగే జరుగుతోంది. రేప్ ఎటాక్ అయింది అంటే, అది ప్రజలకు తెలిస్తే నేను చాలా చీప్ అయిపోతాను అనే ఫీలింగ్ వస్తుంది అని గాయిత్రి తెలిపారు.

   మార్పు అనేది గ్లోబల్‌గా జరుగాలి

  మార్పు అనేది గ్లోబల్‌గా జరుగాలి

  ప్రూఫ్ లేక పోయినా మీరు కంప్లయింట్ ఇచ్చినపుడు వాళ్ల వైపు నుండి ఏం జరిగింది? ఏం జరుగలేదని ఎంక్వయిరీ చేస్తారు కదా? మీకు కంప్లయింట్ ఇస్తే ఇంకొకరి విషయంలో అలా ప్రవర్తించకుండా ఉంటాడు కదా? అనే ప్రశ్నకు గాయిత్రి స్పందిస్తూ... నేను ఇండస్ట్రీని ఎంచుకున్నాను కాబట్టి నన్ను అలా చేశాడని కాదు, వాడి ఇంటెన్షనే బ్యాడ్. వాడికి ఆ టైమ్ కు అది కావాలి. వాడు వేరే విధంగా ఇంకొక అమ్మాయిని ట్రై చేస్తాడు. మార్పు అనేది గ్లోబల్ గా అవ్వాలి... అని గాయిత్రి అన్నారు.

   అపుడు నాకు ఇంత పాపులారిటీ లేదు

  అపుడు నాకు ఇంత పాపులారిటీ లేదు

  నేను అప్పటికి ఫేమస్ కాదు, పోలీస్ కంప్లయింట్ ఇస్తే నా మాటకు అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఇప్పుడున్న పాపులారిటీ అప్పుడు ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో? నా మాట ఒకరిని ప్రభావితం చేయాలి అంటే నాకంటూ ఒక స్థాయి ఉండాలి. ఇపుడు మాములూ అమ్మాయిలకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే చాలా సపోర్ట్ వస్తోంది. కానీ అప్పుడు ఇంత సోషల్ అవేర్‌నెస్ లేదు అని గాయిత్రి తెలిపారు.

   మేము ఐదుగురం ఆడపిల్లలం

  మేము ఐదుగురం ఆడపిల్లలం

  ఇపుడు ఫెమినిజం పెరిగింది. ఇంట్లో కాస్త ఆలోచిస్తున్నారు. నా టైమ్ లో అలాంటి పరిస్థితి లేదు. మా ఇంట్లో మేము ఐదుగురం ఆడపిల్లలం, నేను అందరి కంటే పెద్దదాన్ని. నేను ఏది చేసిన చెల్లెళ్ల మీద ప్రభావం పడుతుందని ఆలోచించేవారు. నాకు ఇంటర్ అయిపోగానే సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. కానీ నేను పెళ్లికి సిద్దంగా లేను అని చెప్పేవాను. నేను పెళ్లి చేసుకోను నాకు సినిమాలు కావాలి అని చెప్పేసరికి టిపికల్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ పీపుల్ గా మా అమ్మ కూడా భయపడింది.... అని గాయిత్రి తెలిపారు.

  వేశ్య పాత్ర అంటే అమ్మ వద్దు అంది

  వేశ్య పాత్ర అంటే అమ్మ వద్దు అంది

  మన సొసైటీ అనేది బాగా డబుల్ స్ట్రాండర్డ్ గా పెరిగింది. ఆ భయాల్లో మా మమ్మీ ఇప్పటికీ ఉన్నారు. నేను చేసిన కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అనే సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అందులో ఒక ప్రాసిట్యూట్ క్యారెక్టర్ చేశాను. మా అమ్మకు ఫోన్ చేసి ఇలాంటి ఓ క్యారెక్టర్ వచ్చింది అంటే వద్దు, నువ్వు అలా చేయొద్దు, ఏమనుకుంటారు చుట్టాలు. అదీ ఇదీ అని క్లాస్ పీకింది. అమ్మా... కామ్ డౌన్ అని చెప్పి.... నేను ఇండివిజ్యువల్ గా బ్రతుకుతున్నాను, నా ఇష్టమైన నిర్ణయం తీసుకుంటాను. దాని ప్రభావం నా లైఫ్ మీద ఎలా ఉంటుందనే ఆలోచించే శక్తి నాకు ఉంది అని చెప్పాను. నీకు నా మీద ప్రేముంది కాబట్టి... నా విషయంలో కేర్ ఉంది కాబట్టి నువ్వు అలా చెప్పావని తెలుసు....అని అమ్మను ఒప్పించినట్లు గాయిత్రి తెలిపారు.

  కాలేజీలో ఐటం అనేవారు

  కాలేజీలో ఐటం అనేవారు

  మా సీనియర్ ఫ్రెండ్ ఒకావిడ గాయిత్రి నువ్వు ఇంత మంది అబ్బాయిల ఫ్రెండ్స్ ను మెయింటేన్ చేస్తావు నీకేమీ ప్రాబ్లమ్ రాలేదా? అని అడిగింది. అపుడు నేను ఒకటే చెప్పాను. నేను అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ మెయింటేన్ చేస్తాను అందుకే ప్రాబ్లం రాలేదు. ఎఫైర్స్ మెయింటేన్ చేస్తే వచ్చేదేమో? అని చెప్పేశాను. నల్గొండలో నేను కాలేజీ చేశాను. అపుడు నన్ను అందరూ చాలా ఓవర్ చేస్తుందని భావించే వారు. నన్ను కాలేజ్ లో ఐటం అని పిలిచే వారు. అబ్బాయిలతో నేను ఎక్కువగా స్నేహం చేయడానికి కారణం అబ్బాయిలు మోర్ లిబరేటెడ్. మెన్ మోర్ బ్రీతబుల్ దెన్ ఉమెన్... అని గాయిత్రి తెలిపారు.

   డైరెక్టర్, ప్రొడ్యూసర్ కెలకటం మొదలు పెట్టారు

  డైరెక్టర్, ప్రొడ్యూసర్ కెలకటం మొదలు పెట్టారు

  2 సంవత్సరాల క్రితం ఒక మూవీ ఒప్పుకున్నాను. నేను ఏ మూవీ యాక్సెప్ట్ చేసినా నా భయం కొద్ది ముందే... కమిట్మెంట్, పడుకోవడం లాంటివి ఉంటే చేయను అని ఫస్ట్ మాట చెప్పేదాన్ని, అది లేదంటేనే సినిమా చేస్తాను అనేదాన్ని. వాళ్లు నో నో నో మేము ప్రాసిస్ట్యూషన్ చేయడం లేదు సినిమా చేస్తున్నాం. ఆర్టిస్టుకు రెస్పెక్ట్ ఇస్తాం, అలాంటివేమీ ఉండవు అని చెప్పడంతో నేను ప్రాజెక్ట్ మొదలు పెట్టాను. అయితే సినిమా మొదలైన తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్ కెలకడం మొదలు పెట్టారు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదని ముందే చెప్పాను... మళ్లీ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించాను. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, నీ కెరీర్ గురించి ఆలోచించుకో అన్నారు. నేను కేర్ చేయను అని తేల్చి చెప్పేశాను. పడుకోవడం ఇష్టం లేకనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చాలా పోగొట్టుకున్నాను. నాకు అడ్వైజ్ లు ఇవ్వకండి, కావాలంటే పెట్టుకోండి, లేదంటే తీసేయండి అని మొహం మీదే చెప్పేశాను.... అని గాయిత్రి తెలిపారు.

  నాకు నైట్ కు ఇంత అని రేటు కట్టారు

  నాకు నైట్ కు ఇంత అని రేటు కట్టారు

  నీకు చాలా ఆరొగెన్స్ ఉంది గాయిత్రి, ఇది మంచిది కాదు అని అన్నారు. నేను వెంటనే ఇది ఆరొగెన్స్ కాదు, సెల్ప్ రెస్పెక్ట్ అని చెప్పాను. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి అన్నాను. నీ ఫోటో చూసి ఎంత మంది అడిగారో తెలుసా? వన్ నైట్ కి ఇన్ని డబ్బులు, అన్ని డబ్బలు అని చాలా మంది అడిగారు. నువ్వు అలా కన్సిడర్ చేసినా ఇన్ని ఇయర్స్ లో నువ్వు కోట్లు సంపాదించేదానివి అంటే నేను ఒకటే చెప్పాను.... నాకు డైరెక్టుగా కూడా ఇలా డబ్బులు ఆఫర్ ఇచ్చిన వారు ఉన్నారు. సింగల్ నైట్ కు కోట్లు ఇస్తామన్నారు. నేను ఈ మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకోలేదు అని చెపేశాను అని గాయిత్రి తెలిపారు.

   నాపై రేప్ అటెమ్ట్ జరిగింది

  నాపై రేప్ అటెమ్ట్ జరిగింది

  ఇక్కడ నా లైఫ్ లో డబ్బు సంపాదించడం నా లక్ష్యం కాదు. సంతృప్తికరమైన లైఫ్ లీడ్ చేయడం, ఇష్టమున్న పనులు చేయడం, బ్రీతబుల్ గా బ్రతకడం అనేది నా చాయిస్. డబ్బులు అనేది లెట్ మై పాషన్ పే. నేను చేసే పనులకు డబ్బులు వస్తే నేను హ్యాపీ, నాకు డబ్బులు ఎప్పటి వరకు అవసరం? నేను బ్రతికుండే వరకు అవసరం. అప్పటి వరకు నాకు ఎలాగో వస్తాయి. తినడానికి తిండి, పడుకోవడానికి ఒక ఇల్లు చాలు. ప్యాలెస్ లు కావాలనే యాంబిషన్స్ అయితే లేవు అని చెప్పేశాను. చెబితే నాపై రేప్ ఎటాక్ కూడా జరిగింది లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్. నన్ను ఇంటి వద్ద కార్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి తీసుకెళ్లి కారు బ్రేక్ డౌన్ అయిందని చెప్పి కొంత సేపు కూర్చుందాం అని ఇంటికి తీసుకెళ్లి నా బట్టలు విప్పడం మొదలు పెట్టాడు. అక్కడి నుండి ఎలాగో తప్పించుకున్నాను. నేను ఇక మీ ప్రాజెక్టు చేయను, నన్ను వదిలేసేయండి అని చెప్పి వచ్చేశాను... అని గాయిత్రి తెలిపారు.

   సొంతగా సినిమా చేయాలనుకున్నాను

  సొంతగా సినిమా చేయాలనుకున్నాను

  తర్వాత ఒకటే అనిపించింది. నా బ్రెయిన్ వర్క్ చేస్తోంది, నేను రాయగలను, పాడగలను, డైరెక్ట్ చేయగలను.... ఒకరు నాకు ఆఫర్ ఇవ్వడం, ఒకరు నాకు లైఫ్ ఇవ్వడం ఏమిటి? అని ఆలోచించాను. సొంతగా నా సినిమా నేనే చేయాలని డిసైడ్ చేసుకున్నాను. అది అవుతుందా? లేదా? అనేది తెలియదు... ప్రయత్నం అయితే జరుగుతోందని గాయిత్రి తెలిపారు.

   నా అవకాశాలు రాకుండా చేస్తున్నాడు

  నా అవకాశాలు రాకుండా చేస్తున్నాడు

  నాపై సంవత్సరం క్రితం రేప్ ఎటాక్ చేసిన నిర్మాత నేను ఎక్కడికి వెళ్లినా అక్కడ ఉంటున్నాడు. నేను స్క్రిప్టు పట్టుకుని తిరుగుతుంటే.... నాకు ఏ ఆఫర్ వచ్చినా చెడగొడుతున్నాడు. ఈ అమ్మాయి వద్దు, ఈమె పొలిటికల్ గా అండర్ గ్రౌండ్ తో టచ్ లో ఉంది. షి ఈజ్ డేంజరస్ డోంట్ టేక్ హర్ డోట్ టేక్ హర్ అని నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడు.... అని గాయిత్రి వాపోయింది.

   10 కత్తులు కొన్నాను

  10 కత్తులు కొన్నాను

  నన్ను నేను రెండు సంవత్సరాలు హౌస్ అరెస్ట్ చేసుకుని భయంకరమైన లైఫ్ లో ఉన్నాను. అమ్మాయి సింగిల్ గా బ్రతుకుతుంది అంటే షి ఈజ్ రెడీ ఫర్ స్లీపింగ్ అనే భావనలో ఉంటారు. ఫిల్మ్ ఆఫర్ ఇస్తారు, గాయత్రి మాట్లాడుకుందామని ఇంటికొస్తారు. నేను తొందరగా నమ్మేస్తాను జనాలను. ఇంటికి ఇన్వైట్ చేస్తే గోకడం మొదలు పెడతారు. అలా రెండు మూడు సార్లు అయ్యేసరికి అబ్బాయిలను ఇలా ఇంటికి పిలవకూడదు అని డోర్ వేసుకోవడం మొదలు పెట్టాను. తర్వాత మధ్య రాత్రి ఎవడో వచ్చి డోర్ కొడతాడు. చాలా భయపడిపోయాను. అపుడు మా ఫ్రెండ్ వచ్చి 2, 3 డేస్ ఇంట్లో ఉన్నాడు. రాత్రి ఎవడో వస్తే వాన్ని కొట్టి తరిమేయడం కూడా జరిగింది. నేను సేఫ్ గా ఉండటానికి 10 కత్తులు కొన్నాను.... అని గాయిత్రి తెలిపారు.

   5 బ్రేకప్స్ అయ్యాయి.

  5 బ్రేకప్స్ అయ్యాయి.

  నేను లాయల్ పర్సన్. నాకు ఇప్పటి వరకు 5 బ్రేకప్స్ అయ్యాయి. నేను ఎప్పుడూ రిలేషన్ షిప్ లో సీరియస్ గానే ఉండాలని అనుకున్నాను. కానీ వర్కౌట్ కాలేదు. లాస్ట్ బ్రేకప్ అయితే చాలా హారబుల్. అతడు నాకు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాడు. ఒక్కసారి అతడు నా లైఫ్ లో లేడు అనగానే తట్టుకోలేక పోయాను. రెండు సంవత్సరాలు హౌస్ అరెస్ట్ చేసుకుని ఆల్మోస్ట్ డైయింగ్ స్టేజీకి వచ్చాను. తర్వాత మెల్లిగా అందులో నుండి బయటకు వచ్చాను.... అని గాయిత్రి తెలిపారు.

  English summary
  Producer rape attack on me, says Actress Gayathri Gupta. But his name was not revealed. Actress Gayatri Gupta also said some interesting comments about casting couch in a recent interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X