సప్తగిరితో మూడో సినిమా చేస్తానో లేదో.. స‌ప్త‌గిరి ఎల్‌ఎల్‌బికి హిట్ టాక్.. నిర్మాత డా.ర‌వికిర‌ణ్‌

By Rajababu

సప్తగిరి కథానాయకుడిగా న‌టించిన చిత్రం స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ బ్యానర్‌పై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'. ఈ సినిమా డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా నిర్వహించిన మీడియా స‌మావేశంలో నిర్మాత డా.ర‌వికిర‌ణ్ మాట్లాడారు.

 ఇమేజ్ లేని హీరో అయితే

ఇమేజ్ లేని హీరో అయితే

‘స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి' చిత్రానికి హిట్ టాక్ రావడం ఎంతో హ్యాపీగా ఉంది. సాధార‌ణంగా ఏదో సినిమా తీయాల‌ని కాకుండా ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీయాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాను చేశాం. నా ప్రొడ‌క్ష‌న్‌లో వ‌చ్చిన స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ కంటే ఈ సినిమాకు అన్ని వ్య‌వ‌హ‌రాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్నాను. ఇలాంటి స‌బ్జెక్ట్‌ను చెప్పాల‌నుకుంటే ఇమేజ్ ఉన్న హీరో కంటే, ఇమేజ్ లేని నటుడైతేనే బావుంటుంద‌ని స‌ప్త‌గిరితో సినిమా చేశాను.

 వారు సినిమాకు మూల స్తంభాలుగా

వారు సినిమాకు మూల స్తంభాలుగా

స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి చిత్రానికి ప‌రుచూరి బ్ర‌దర్స్‌ మంచి డైలాగ్స్ రాశారు. మాతృకలోని భావోద్వేగాలు దెబ్బతినకుండా తెలుగు నెటివిటీకి తగినట్టు రాయ‌డానికి చాలా హార్డ్ వ‌ర్క్ చేశాం. శివ‌ప్ర‌సాద్‌, సాయికుమార్‌, స‌ప్త‌గిరి ఈ చిత్రానికి మూలస్థంభాలుగా నిలిచారు. ఓ మంచి సినిమాను నిర్మించినందుకు నిర్మాత‌గా సంతోషంగా ఉన్నాను.

 భవిష్యత్‌లో మెసేజ్ ఓరియెంటెడ్

భవిష్యత్‌లో మెసేజ్ ఓరియెంటెడ్

భ‌విష్య‌త్‌లో కూడా ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రాల‌నే నిర్మిస్తాను. ఇక సినిమాలో న‌టించ‌డం అనేది యాదృచ్చికంగానే జ‌రిగింది. మ‌రి భ‌విష్య‌త్‌లో న‌టిస్తానా? లేదా? అనేది చెప్ప‌లేను. అంతా! ఆ భ‌గ‌వంతుడి చేతిలో ఉంది. చిన్న‌ప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ కావ‌డంతో ఆ అనుభ‌వం ఇక్క‌డ ప‌నికొచ్చింది.

 సప్తగిరితో మూడో సినిమా గురించి

సప్తగిరితో మూడో సినిమా గురించి

సప్తగిరి ఎల్‌ఎల్‌బీ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ, రీరికార్డింగ్ పెద్ద ప్ల‌స్ అయ్యాయి. స‌ప్త‌గిరితో మూడో సినిమా చేస్తాన‌ని ఇప్పుడే చెప్ప‌లేను. క‌థ డిమాండ్ చేస్తే త‌న‌తో చేస్తాను. లేదా మరో హీరోతో అయినా చేయ‌డానికి నేను సిద్ధ‌మే. జాలీ ఎల్‌.ఎల్‌.బి 2 సినిమాను నిర్మించ‌ను. ద‌ర్శ‌కుడు చ‌ర‌ణ్‌, స‌ప్త‌గిరి స‌హా అంద‌రికీ స‌మిష్టి కృషే ఇది.

 రైతుల ఆత్మహత్యలతో

రైతుల ఆత్మహత్యలతో

నాది ఆదిలాబాద్ జిల్లా. నేను పుట్టి పెరిగిన ఊరు కావ‌డంతో పాటు..అక్క‌డి రైతుల ఆత్మ‌హ‌త్య‌లు న‌న్ను క‌లిచివేసింది. కాబ‌ట్టి వారి స‌మ‌స్య‌ల‌ను ఈ సినిమా ద్వారా తెర‌పై చూపాల‌నుకున్నాను. ఫిదా త‌ర్వాత తెలంగాణ‌లో అంద‌మైన లోకేష‌న్ ఉన్న ప‌ల్లెటూరిని మా సినిమాలోనే చూపించాం అని నిర్మాత డాక్టర్ రవికిరణ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X