»   » నిర్మాత రవిశంకర్ ప్రసాద్ అదృశ్యం

నిర్మాత రవిశంకర్ ప్రసాద్ అదృశ్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Anand Cine Services
హైదరాబాద్ : ఆనంద్ రీజెన్సీ హోటల్, ఆనంద్ సినీ సర్వీసెస్ యజమాని రవిశంకర ప్రసాద్ అదృశ్యమయ్యారు. రవిశంకర ప్రసాద్ సోమవారం తెల్లవారు జామున యానంలో వాకింగ్ కు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. కనీసం అతనికి సంబంధించిన సమాచారం కూడా కుటుంబ సభ్యులకు అందలేదు.

దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు యానాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవిశంకర్ ప్రసాద్ సెల్ ఫోన్ కూడా పని చేయడం లేదని తెలుస్తోంది. పోలీసులు వివిధ కోణాల్లో ఆయన కోసం వెతుకుతున్నారు.

రవిశంకర్ ప్రసాద్ ఏమయ్యాడనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దాదాపు 36 గంటలు గడిచినా ఆయన ఆచూకీ తెలిక పోవడంతో ఆయన రోజూ వాకింగ్ చేసే పరిసరాలతో, ఇతర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రవిశంకర్ వ్యక్తిగత విషయాలతో పాటు ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇటు సినీ రంగంలో కూడా రవిశంకర్ ప్రసాద్ అదృశ్యం సంఘటన చర్చనీయాంశం అయింది. ఏమైనా డబ్బు వ్యవహారాలేమైనా ఆయన అదృశ్యానికి కారణం అయి ఉంటాయా? లేక మరేమైనా కారణాలు ఉండొచ్చా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
Producer avi Shankar Prasad has gone missing. He is a noted film producer and owner of Anand Cine Services and Anand Regency Hotels.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X