twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవును...మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనే

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాలకృష్ణ గారు నాకు ఇష్టమైన వ్యక్తి. వాళ్లబ్బాయి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనేది నా కోరిక. అందుకోసం 'రానే వచ్చాడయ్యా ఆ రామయ్యా' అన్న టైటిల్‌ నమోదు చేశాను కూడా. మిగతా విషయాలు బాలయ్యే చెబుతారు. టీవీలో పాటల్ని బాగా వింటాను. అందులో సినిమా టైటిల్స్‌గా పెట్టుకునే మాటలు వస్తాయేమోనని పరిశీలిస్తాను. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని పాట నుంచి తీసుకున్నదే 'రానే వచ్చాడయ్యా ఆ రామయ్యా' అన్నారు ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి.

    ఇక బాలకృష్ణ గురించి చెప్తూ... ఆయనతో లెజెండ్‌ సినిమా చేయకముందు... ఆయనకు చాలా కోపమంట, ఆయన అలా అంట ఇలా అంట... అని ఏవేవో విన్నాను. ఆయనతో 160 రోజులు కలిసి పనిచేసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే... ఆయన అబద్ధం ఆడరు, ఒకర్ని మోసం చెయ్యరు. ఈ రెండూ చేసేవారిని దగ్గరకి చేరనివ్వరు. నేను తీసే ప్రతి సినిమానీ ఆ కుటుంబం చూస్తుంది అన్నారు.

    Producer Sai Korrapati To Produce Mokshagna?

    తను సినిమాలు ఓకే చేసే విధానం గురించి చెప్తూ....ఇంటర్నెట్‌, ఈమెయిల్‌ గురించి నాకు తెలియదు. కానీ సినిమా గురించి తెలుసు. డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నపుడు నేల క్లాసుకు వెళ్లి సినిమా చూసేవాణ్ని. అలా జనాల నాడి కొంత తెలుసుకోగలిగాను. కథ ఎంచుకునే ముందు అది వెరైటీగా ఉందా అని చూస్తాను.

    ఒకవేళ రొటీన్‌గానే ఉంటే, అందులో మాస్‌, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌్‌ ఉన్నాయో లేదో చూస్తాను. అంతమాత్రానికే విజయం దక్కుతుందని కాదు. నాకన్నా డబ్బు ఉన్నవాళ్లూ, టేస్ట్‌ ఉన్నవాళ్లూ చాలామంది ఉన్నారు. కానీ వీటితోపాటు అదృష్టమూ ఉండాలి. లేకపోతే ఈ ఏడాది మా బ్యానర్‌లో 'లెజెండ్‌', 'వూహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్యా'... ఇలా మూడు హిట్‌లు దొరుకుతాయా అని తేల్చి చెప్పారు.

    English summary
    Now, Sai Korrapati confirmet the he has registered a title 'Raane Vachadu Aa Ramayya' under Vaarahi Chalana Chitra banner for Balakrishna's son Mokshagna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X