పవన్ కల్యాణ్‌కు ఎప్పుడూ ఆర్థిక సమస్యలే.. ఎందుకంటే.. నిర్మాత శరత్ మరార్

టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోల్లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఒకరంటే ఎలాంటి సందేహం ఉండనక్కర్లేదు. పవన్ కల్యాణ్ సినిమా చేస్తానంటే లెక్కలేనంత మంది ఆయనతో సినిమా తీసేందుకు క్యూ కడుతారు. అలాంటి స్టార్ హీరో ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో బాధపడతుంటారనేది తరచుగా మీడియాలో వినిపిస్తుంటాయి. ఆ విషయంపై ఆయన సన్నిహితుల్లో ఒకరైన శరత్ మరార్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన ఇటీవల ప్రముఖ మీడియాతో చెప్పిన ప్రకారం..

జానీ మూవీతో ప్రయాణం

జానీ మూవీతో ప్రయాణం

పవన్ కల్యాణ్‌తో నా రిలేషన్ జానీ సినిమాతో మొదలైంది. నిర్మాత అల్లు అరవింద్ సిఫారసుతో ఆ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అప్పటి నుంచి ఆయనతో దాదాపు రెండు దశాబ్దాలుగా ట్రావెల్ అవుతూ వస్తున్నాను. ఆ తర్వాత ఏకంగా పవన్ కల్యాణ్‌తో మూడు సినిమాలు నిర్మించడం అదృష్టంగా భావిస్తాను అని శరత్ మరార్ చెప్పారు.

ఫెయిల్యూర్‌కు అసలే భయపడరు

ఫెయిల్యూర్‌కు అసలే భయపడరు

పవన్ కల్యాణ్‌తో మూడు సినిమాలు రూపొందించే అవకాశం రావడం నా జీవితంలో గొప్ప విషయంగా భావిస్తాను. సినిమా ఫెయిల్ అవుతాయనే భయం ఉండదు. ఫెయిల్యూర్‌కు అసలే భయపడరు. సినిమాలు ఫ్లాఫ్ అయితే ఒకరిని నిందించరు. చాలా బ్యాలెన్స్‌గా ఉంటారు. ఆయన చాలా ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి అంటూ శరత్ మరార్ పేర్కొన్నారు.

సంపాదనపై ఆలోచనే ఉండదు

సంపాదనపై ఆలోచనే ఉండదు

పవన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల ఆధారంగా నేను ఆయనను దగ్గర నుంచి గమనించాను. ఆయనకు డబ్బు అంటే వ్యామోహం. బాగా సంపాదించాలనే ఆలోచన అసలే ఉండదు. డబ్బు ఉంటే దానిని దాచుకోవాలి. వెనుకేసుకోవాలనే ధ్యాస ఎప్పడూ కనిపించిన దాఖలాలు లేవు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందు వెనుక ఆలోచించకుండా డబ్బును ఇచ్చేస్తుంటారు. పిల్లల ఆరోగ్యం, చదువు ఇలాంటి విషయాలపై స్పందిస్తుంటారు అని నిర్మాత శరత్ మరార్ చెప్పారు.

ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతోనే

ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతోనే

పవన్ కల్యాణ్‌ సంపాదించింది కూడబెట్టాలనే ఆలోచన లేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. ఎప్పుడూ ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు వెంటాడుతుంటాయి. అందుకు కారణం కేవలం డబ్బుపై మోజు లేకపోవడమే. అయితే డబ్బు అవసరమైన నీతి, నియమాలు గాలికి వదిలేసిన దాఖలాలు నేను చూడలేదు అని శరత్ మరార్ అన్నారు.

Recommended Video

Naga Shaurya's New Film Launch
పీకల్లోతూ సమస్యలతో గోపాల గోపాలా

పీకల్లోతూ సమస్యలతో గోపాల గోపాలా

పవన్ కల్యాణ్‌లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పడైనా సబ్జెక్ట్ బాగా లేకుంటే సినిమాలు చేయడు. ఎలాంటి మొహమాటం లేకుండా దానిని రిజెక్ట్ చేస్తుంటారు. పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన చేసిన సినిమా గోపాల గోపాల. కేవలం డబ్బుపరంగా ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి చేశారు అని శరత్ మరార్ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X