జన్మలో అలాంటి తప్పు చేయను.. చిరు, రామ్ చరణ్ లకు నిర్మాత క్షమాపణలు
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై దుష్ప్రచారం చేస్తున్నారని రామ్ చరణ్ అభిమానులు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దానికి రిప్లైగా ప్రముఖ నిర్మాత క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను ఎక్స్ వేదికన పంచుకున్నారు. అసలు తన మాట్లాడిన ఉద్దేశం వేరంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూతోనే గేమ్ ఛేంజర్ నిర్మాత కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దాంతో అభిమానులు ఫైర్ అయ్యింది. అందుకు బదులుగా వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఆయన మాట్లాడిన వివరాల్లోకి వెళితే..
గేమ్ ఛేంజర్ వివాదం ఏంటీ.?
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025 జనవరి 10 గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. దీంతో సినిమాపై నిర్మాతలు దిల్ రాజ్, శిరీష్ రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేశారు. కానీ రూ.180 కోట్లు మాత్రమే బాక్సాఫీస్ నుంచి తిరిగి వచ్చింది. దీంతో ఇంకా మిగిలినది నష్టపోయారని వార్తలు వచ్చాయి. అయితే గేమ్ ఛేంజర్ సినిమాతో తాము ఎంతగానో నష్టపోయినా చిరు, రామ్ చరణ్ మర్యాదకైనా ఫోన్ చేసి అడగలేదని నిర్మాత శిరీష్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆయన కాస్తా రామ్ చరణ్ పై నెగెటివ్ ప్రచారం చేసినట్టు గా రామ్ చరణ్ అభిమానులు భావించారు. ఇక అప్పటి నుంచి వివాదం మొదలైంది.

రామ్ చరణ్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్..
గేమ్ ఛేంజర్ నష్టపోవడం పట్ల ఇటీవల పలు ఇంటర్వ్యూలు కారణం ఎవరంటూ ఎదురైనా ప్రశ్నలపై నిర్మాతలు ఆసక్తికంగా స్పందించారు. వారి సమాధానాలు రామ్ చరణ్ అభిమానులను బాధించాయి. దీంతో సూటిగా హెచ్చరించారు. రామ్ చరణ్ పై దుష్ప్రచారం చేస్తే అస్సలు ఊరుకోబోమని, తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రకటనలో తెలిపారు. ఒక్క ఏడాది సినిమాకు 3 ఏళ్లు టైమ్ ఇచ్చిన హీరోను, ఆర్ఆర్ఆర్ వంటి సినిమా తర్వాత మీతో సినిమాకు అవకాశం ఇచ్చిన హీరోపై విషం చిమ్మే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.
స్పందించిన నిర్మాత శిరీష్..
రామ్ చరణ్ అభిమానులు ఫైర్ అవ్వడంతో గేమ్ ఛేంజర్ నిర్మాత శిరీష్ వెంటనే స్పందించారు. క్షమాపణలు చెబుతూ వీడియోను ఎక్స్ వేదికన పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మా ఎస్వీసీ సంస్థకు చిరంజీవి, రామ్ చరణ్ కు మంచి బంధం ఉంది. నేను మెగాస్టార్ అభిమానినే. కానీ నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్, చిరంజీవి గారెపై మాట దొర్లానని ఫ్యాన్స్ బాధపడుతున్నారని తెలిసింది. అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. అభిమాలనుతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ గారికి కూడా క్షమాపణలు చెబుతున్నాను.
దయచేసి ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఉద్దేశపూర్వకంగా అన్న పదాలు కావవి. నాకు అది ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇక నేను కంగారు పదాలు తప్పుగా వాడి ఉంటాను. మరోవైపు చిరంజీవి గారితో, రామ్ చరణ్ గారితో మాకు ఉన్న దగ్గరి సంబంధం వల్ల అలా అని ఉండొచ్చేమో. కానీ వాళ్లని ఉద్దేశపూర్వకంగా అనేంత మూర్ఱుడిని కాదు. సినిమా రిలీజ్ సమయంలోనూ రామ్ చరణ్, చిరు సహకరించారు. రామ్ చరణ్ తో మరో ప్రాజెక్ట్ కూడా ఓకే అయ్యింది. త్వరలో ఆ సినిమాను పట్టాలెక్కించబోతున్నాం. ఇలాంటి సమయంలో మా మధ్య అభిప్రాయ బేధాలకు తావివ్వకూడదనని' చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











