నాకు పళ్ళూడాయి..శ్యామ్ ప్రసాద్ రెడ్డి
అరుంధతి చిత్రంతో చరిత్రను క్రియేట్ చేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి తాజాగా కలవరమాయే మదిలో చిత్రం ఆడియో పంక్షన్ కి అటెండయ్యారు. ఆ సందర్భంగా ఆయన ఆ సినిమాతో నాకు ఫళ్లూడాయి అని కామెంట్ చేసారు. యాంకర్ ఝాన్సీ భారీ చిత్రాల నిర్మాత అని ఆయన్ని సంబోధించినప్పుడు ఆయన తన ప్రసంగంలో పై విధంగా వ్యాఖ్యానించారు. "నేను అన్నీ చిన్న సినిమాలే తీశాను. ఒకే ఒక భారీ చిత్రం తీశాను. దాంతో నా పళ్ళూడాయి" అన్నారు. ఆయన నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం మెగాస్టార్ హీరోగా నటించగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన "అంజి". ఈ చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఆర్ధికంగా దెబ్బతీసింది.
shyam prasad reddy kalavaramaya madilo arundhati anushka chiranjeevi anji కోడి రామకృష్ణ అంజి మెగాస్టార్ యాంకర్ ఝాన్సీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అరుంధతి


Click it and Unblock the Notifications