»   » పవన్, మహేష్ ప్లాఫ్ సినిమాల నిర్మాతకు జైలు శిక్ష

పవన్, మహేష్ ప్లాఫ్ సినిమాల నిర్మాతకు జైలు శిక్ష

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కొమరం పులి, మహేష్ బాబు హీరోగా ఖలేజా లాంటి భారీ ప్లాపు చిత్రాలను నిర్మించిన నిర్మాత సింగనమల రమేష్. ఈ మధ్య కాలంలో అసలు వార్తల్లో లేని రమేష్... ఓ కేసుకు సంబంధించి వార్తల్లోకి వచ్చారు.

సింగనమల రమేష్ కు చెక్‌బౌన్స్‌ కేసులో జైలు శిక్ష విధిస్తూ కర్నూలు ఎక్సైజ్‌ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి దగ్గర రమేష్ 15లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే అతడికి చెల్లని చెక్‌ ఇచ్చిన కేసులో రమేష్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Producer Singanamala Ramesh gets one year Jail

సింగనమల రమేష్ మొదటి నుండి వివాదాస్పదుడిగా ఉన్నారు. ఆ మధ్య మద్దెలచెరువు సూరి హత్య కేసులో కూడా పోలీసులు రమేష్ ను విచారించారు. మాఫియాకు సంబంధించిన డబ్బను చిత్ర పరిశ్రమలో సినిమాల నిర్మాణానికి ఉపయోగించారనే ఆరోపణలు కూడా రమేష్ పై వినిపించాయి.

English summary
Tollywood Producer Singanamala Ramesh gets one year Jail in cheque bounce case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu