స్క్రీన్ మీద ప్రళయాన్ని సృష్టించారు.. 20 నిమిషాలు ఊపిరి బిగపట్టి..నిర్మాత ఎస్‌కేఎన్

మలయాళంలో సంచలనం విజయం నమోదు చేసుకొన్న చిత్రం 2018 చిత్రం. జ్యూడ్ అంథోని జోసెఫ్ దర్శకత్వంలో వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించిన చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది. టొవినో థామస్, లాల్ నారైన్, అపర్ణా బాల మురళి, కళైరాసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్ తదితరులు నటించిన ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ అయి మంచి రెస్సాన్స్ అందుకొంటున్నది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్ల గురించి సినిమా యూనిట్ మీడియాతో మాట్లాడుతూ...

2018 అనే సినిమా కేరళలో 150 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. గతేడాది కాంతార, కేజీఎఫ్ ఎలాంటి విజయాలు సాధించాయో.. ఈ సంవత్సరం అలాంటి విజయాన్ని 2018 చిత్రం సాధించింది. మలయాళంలో మల్టీసారర్ చిత్రంగా తెరకెక్కింది. యూనివర్సల్ థీమ్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఎక్కడైనా వర్షం అనేది యూనివర్సల్. వర్షం, వరదలు ఎక్కడైనా వస్తాయి. అలాంటి నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలోని విజువల్ చూస్తే మైండ్ పోయింది అని నిర్మాత ఎస్‌కేఎన్ అన్నారు.

ఒక సినిమాలో రెయిన్ సీన్ తీయాలంటేనే కష్టం. అలాంటిది సినిమా కోసం ప్రళయాన్ని సృష్టించారు. అందులో ఈ సినిమా కోసం తక్కువ గ్రాఫిక్స్ వాడారు. థ్యాంక్స్ టూ జోసెఫ్, వేణు. విజువల్ అప్పీలింగ్‌గా ఉంటుంది. సినిమా చూస్తే వరదలో మనం కూడా మునిగిపోయామనే ఫీల్ కలుగుతుంది. కేరళలో జరిగిన సన్నివేశాలు తెర మీద చూస్తే మళ్లీ ఆ విషయం గుర్తుకు వచ్చింది అని నిర్మాత ఎస్‌కేఎన్ అని అన్నారు.

2018 movie

కేరళలో 2018లో వరదలు సంభవించినప్పుడు మేము కూడా అక్కడే ఉన్నాం. గీతా గోవిందం సినిమా గోపి సుందర్‌తో కలిసి రీరికార్డింగ్ చేస్తున్నాం. అప్పుడే వరదలు వచ్చాయి. నేను, మారుతి రోడ్డు ద్వారా హైదరాబాద్‌కు చేరుకొన్నాం. తొలి రోజు మంచి ఆక్యుపెన్సీ బాగుంది. ఫ్యామిలీలంతా బిగ్ స్క్రీన్‌పై చూసి కొత్త అనుభూతి పొందడానికి అవకాశం ఉంది అని నిర్మాత ఎస్‌కేఎన్ చెప్పారు.

2018 movie

2018 సినిమాలో చివరి 20 నిమిషాలు ఊపిరి బిగపట్టి చూస్తారు. ఈ వీకెండ్ ఈ సినిమాను చూడండి. 150 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాను 150 రూపాయలు పెట్టి చూడండి. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను వచ్చే వారం ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాను ప్రజలకు రీచ్ అయ్యేలా చేసింది మీడియానే. ఈ సినిమాకు ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఇచ్చారు అని నిర్మాత ఎస్‌కేఎన్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X