అక్కతో బ్రేకప్ అయితే.. చెల్లెల్ని ట్రై చేశా.. లవ్ ఫెయిల్యూర్స్‌పై నిర్మాత ఎస్‌కేఎన్
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మాణ సారథ్యంలో రచయిత, దర్శకుడు సాయి రాజేష్ రూపొందించిన చిత్రం బేబి. ఆనంద దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రం జూలై 14వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం జూలై 7వ తేదీన హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో బేబీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఆ ట్రైలర్ ఈవెంట్ వివరాల్లోకి వెళితే..
బేబీ సినిమా ట్రైలర్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వంశీ పైడిపల్లి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్‌తోపాటు సాయి రాజేష్, బన్నీ వాసు, మారుతి, సతీష్ దాసరి, ధీరజ్ మొగలినేని, ఎడిటర్ విప్లవ్ నైషదం, సినిమాటోగ్రాఫర్ బాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో చిత్ర యూనిట్ మాట్లాడింది.

ఈ సందర్భంగా ఎస్కేఎన్ మాట్లాడుతూ.. నా జీవితంలో జరిగిన బ్రేకప్స్ గురించి లెక్క పెడితే.. ఇక్కడ ఉన్నవారి మేకప్స్ ఆరిపోతాయి. అంత టైమ్ పడుతుంది. నా బ్రేకప్స్ చెప్పాలంటే చాలా లిస్టు ఉంది. లవ్‌లో ఫెయిల్ అయిన వాడే జీవితంలో సక్సెస్ అవుతాడని నేను నమ్ముతాను. నేను చాలా సార్లు లవ్‌లో ఫెయిల్ అయ్యాను. అందుకే జీవితంలో సక్సెస్ అయ్యాను అని ఎస్‌కేఎన్ అన్నారు.
నా లైఫ్‌లో తొలిసారి బ్రేకప్ జరిగినప్పుడు నేను బాధపడలేదు. మరో అమ్మాయిని ట్రై చేశాను. నాతో బ్రేకప్ అయిన అమ్మాయి సిస్టర్‌నే లవ్ చేశాను. అక్కతో బ్రేకప్ కావడంతో ఆ అమ్మాయి చెల్లెల్ని ట్రై చేశాను. అక్క ఇగో హర్ట్ చేయడానికి చెల్లెలికి ప్రపోజ్ చేశాను. కాకపోతే ఆ వివరాలు అడగకు. ఆ విషయాలు ఇక్కడ చెబితే బాగుండదు అని ఎస్‌కేఎన్ చెప్పారు.
బేబీ మూవీ ట్రైలర్‌లో చివరగా చెప్పిన డైలాగ్.. మేము తలచుకొంటే మాకంటే గొప్పగా కొట్టే వాళ్లు ఎవరు ఉండరు అనే డైలాగ్ గురించి హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ.. స్టేజ్ మీద మాట్లాడటప్పుడే.. ఎవరైనా మాట్లాడితే వణికి పోతాను. అలాంటిది ఎవరినైనా కొట్టగలనా అని వైష్ణవి చెప్పారు.


Click it and Unblock the Notifications











