»   »  నిర్మాత శ్రీరామ్ రెడ్డి కన్నుమూత

నిర్మాత శ్రీరామ్ రెడ్డి కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చంద్రమహేశ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ బాషల్లో ‘రెడ్ అలర్ట్' చిత్రాన్ని నిర్మిస్తున్న పిన్నింటి వీర శ్రీరామ్ రెడ్డి శనివారం ముంబైలో గుండెపోటుతో కన్నమూసారు. శ్రీరామనవమి రోజున పుట్టిన ఆయన శ్రీరామ నవమి రోజునే చనిపోవడం విశాదం.

వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన శ్రీరామ్ రెడ్డి ముంబైలో భవన నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. సినిమాలపై మక్కువతో సినీ నిలయం క్రియేషన్స్ సంస్థ స్థాపించారు. తొలి ప్రయత్నంలో ఒకేసారి నాలుగు బాషల్లో ‘రెడ్ అలర్ట్' నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకు రంగం సిద్దం చేస్తున్నారు.

 Producer Sriram Reddy No More

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఇళయారాజా ఆధ్వర్యంలో పాటలను రికార్డ్ చేసారు. మరో పక్క నూతన దర్శకుడు చందూతో ‘ఈ సినిమా సూపర్ హిట్ గురూ' అనే చిత్రం తీస్తున్నారు. శ్రీరామరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేదవ్ ‘రెడ్ అలర్ట్' చిత్రంలో హీరోగా నటించారు. శ్రీరామ్ రెడ్డి మంచి విలువలున్న నిర్మాత అని, ఆయన మృతి తమకు తీరని లోటు అని చంద్రమహేష్ చెప్పారు.

English summary
Telugu movie Producer Sriram Reddy passed away after suffering a massive heart attack.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu