లవ్ స్టోరీకి పది ఓటీటీ ఆఫర్లు.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన నిర్మాత
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో లవ్ స్టొరీ ఒకటి. శేఖర్ కమ్ముల - సాయి పల్లవి కాంబినేషన్లో ఫిదా సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి బడా ఓటీటీ బ్యానర్లు బాగానే ట్రై చేశాయి.
డైరెక్ట్ ఓటీటీ ఆఫర్స్ కు ఒప్పుకొని ఉండి ఉంటే పెట్టిన బడ్జెట్ కు రెండింతల లాభం వచ్చి ఉండేది. శేఖర్ కమ్ముల - సాయి పల్లవి కాంబినేషన్ తో పాటు నాగచైతన్య కూడా ఉండడంతో సినిమాకు మార్కెట్ అయితే గట్టిగానే ఉంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల నిర్మాత సునీల్ నారంగ్ ఓటీటీ ఆఫర్స్ పై ఓపెన్ గా క్లారిటీ ఇచ్చారు. లవ్ స్టొరీ సినిమాకు ఒకటి కాదు పదికి పైగా ఆఫర్స్ వచ్చాయని అయితే సినిమాను థియేట్రికల్ గానే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్పారు.

రిలీజ్ డేట్ పై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్ని సినిమా థియేటర్లు మళ్ళీ ఎప్పటిలా కొనసాగితేనే సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మరోవైపు శేఖర్ కమ్ముల ఈ సినిమా అనంతరం సునీల్ నారంగ్ తో ధనుష్ మూవీని భారీగా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రానుంది.


Click it and Unblock the Notifications











