twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేయలేదు: సురేష్ బాబు

    |

    తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థది ప్రత్యేక స్థానం. డి రామానాయుడు 1964లో స్థాపించిన ఈ సంస్థ ఇటీవలే 55 సంవత్సరాలు పూర్తి చేసుుంది. ఒక ప్రొడక్షన్ కంపెనీ ఇన్ని సంవత్సరాలు ఎలాంటి బ్రేక్ లేకుండా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

    రాముడు, భీముడు చిత్రంతో

    రాముడు, భీముడు చిత్రంతో

    ఎన్టీ రామారావుతో 'రాముడు-భీముడు' సినిమాతో ఈ సంస్థ ప్రస్థానం మొదలైంది. ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన రామానాయుడు... చిరంజీవి లాంటి సక్సెస్‌ఫుల్ హీరోతో ఒకేఒక్క సినిమా చేశారు. ఆ తర్వాత చిరంజీవితో సినిమాలు తీయకపోవడానికి కారణం ఏమిటి? అంటే సురేష్ బాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

    మళ్లీ డేట్స్ ఇస్తేనే

    మళ్లీ డేట్స్ ఇస్తేనే

    మా నాన్న ఎప్పుడూ సక్సెస్ ఫుల్ పీపుల్ వెనక వెళ్లలేదు. ఫెయిల్యూర్‌లో ఉన్నవారిని కూడా తీసుకోవడం మా ప్రొడక్షన్ ప్రిన్సిపుల్. ముఖ్యంగా ఆయన హీరోల కోసం వెయిట్ చేసేవారు కాదు. ఫస్ట్ టైమ్ రామారావుగారితో తీశారు. మామూలుగా ఆ రోజుల్లో నిర్మాతలు రామారావుగారు మళ్లీ డేట్స్ ఇస్తేనే సినిమా తీసేవారు. కానీ మా నాన్నకు తొందరెక్కువ. ఒకదాని తర్వాత ఒకటి తీసేశారు. ఏం బ్రదర్ వెయిట్ చేయండి అంటే.. ఆఫీస్ జీతాలు ఇవ్వాలని మరొకటి చేసేవారని, అలా రామారావుగారి డేట్స్ మా నాన్నకు లేట్ అవుతుండేవని సురేష్ బాబు గుర్తు చేసుకున్నారు.

    అందుకే ఆ ప్రయత్నం చేసేవారు కాదు

    అందుకే ఆ ప్రయత్నం చేసేవారు కాదు

    మన టైంలో మన ఏజ్ గ్రూపు హీరోలతో ఈజీగా సినిమాలు తీసేయగలం. మనకన్నా యంగ్‌స్టర్స్ ఉన్నపుడు అలా వీలయ్యేది కాదు. చిరంజీవిగారు, బాలకృష్ణ గారు మా నాన్నకు చాలా క్లోజ్. కానీ ఆయన వెళ్లి చేయండి సినిమా అని అడిగేవారు కాదు. ఒక వేళ వెళ్లి అడిగితే ఒక ఆరు నెలలు ఆగండి, సంవత్సరం ఆగండి అని అంటారేమో డౌట్‌తో ఆ ప్రయత్నం చేసేవారు కాదని తెలిపారు.

    స్టార్స్ లేకుండానే సక్సెస్‌‌లు

    స్టార్స్ లేకుండానే సక్సెస్‌‌లు

    స్టార్స్ లేకుండానే మా సంస్థకు సక్సెస్‌లు వచ్చాయి. చిరంజీవితో ఖైదీకి ముందే 'సంఘర్షణ' తీశాం, తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేశాం.... స్టార్లు లేకుండా చేసిన ప్రతిధ్వని, ప్రేమఖైదీ లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. 86 తర్వాత వెంకటేష్ వచ్చేయడంతో చాలా స్టోరీలు తమ్ముడితోనే తీయడం మొదలైందని సురేష్ బాబు తెలిపారు.

    English summary
    "My father D Rama Naidu not went behind successful stars, That's why he made only one film with Chiranjeevi." Producer Suresh Babu said. Daggubati Suresh Babu is a Telugu film producer, studio owner and distributor and managing director of Suresh Productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X