twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నారప్ప షూటింగ్ టైమ్‌లో నలుగురు చనిపోయారు.. భయపడి పారిపోయాం: నిర్మాత సురేష్ బాబు

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ ఓటీటీ హవా మొదలైనట్లు ఇటీవల నారప్ప సినిమాతో చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. మొన్నటి వరకు నాని లాంటి వారిని ఓటీటీ డామినేట్ చేయడం స్టార్ట్ చేసిందని అనుకుంటే ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమయ్యారు. ఇక నిర్మాత సురేష్ బాబు అందుకు గల కారణాలను చెప్పారు. అంతే కాకుండా నారప్ప షూటింగ్ టైమ్ లోనే నలుగురు చనిపోయిన విషయాన్ని గురించి కూడా చెప్పారు.

    Recommended Video

    Actress Priyamani Exclusive Interview About Narappa Movie | Part 3 ​| Filmibeat Telug
    మినిమమ్ లాభాలు అందుకునేలా

    మినిమమ్ లాభాలు అందుకునేలా

    నిర్మాత సురేష్ బాబు సీనియర్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. సినిమా బిజినెస్ లో అపారమైన అనుభవం ఉన్న నిర్మాత. సినిమా చూసి ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పగలరు. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే మినిమమ్ లాభాలు అందుకునేలా ప్లాన్ చేసుకుంటారు. నాన్ థియేట్రికల్ బిజినెస్ లో కూడా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు.

    ఓటీటీలోనే బెటర్

    ఓటీటీలోనే బెటర్

    ఏ నిర్మాత అయినా సరే ఎలాంటి సినిమా చేసినా కూడా ఫైనల్ గా బిజినెస్ పరంగానే చూస్తారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సురేష్ బాబు అదే విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం థియేట్రికల్ గా విడుదల చేసి రిస్క్ చేయడం కన్నా కూడా ఓటీటీలోనే విడుదల చేయడం బెటర్ అనిపించినట్లు తెలిపారు.

    విరటపర్వం రిలీజ్..?

    విరటపర్వం రిలీజ్..?

    ఇక విరాట పర్వం కూడా ఓటీటీలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చాలా రోజులుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఫైనల్ గా ఆ విషయం గురించి మాట్లాడుతూ.. దానికి కూడా బెటర్ బిజినెస్ జరిగితే అలానే రిలీజ్ కావచ్చని క్లియర్ గా తెలిపారు. ఇక ఆ సినిమాకు నెట్ ఫ్లిక్స్ 50కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లు ఇటీవల టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

    షూటింగ్ మధ్యలోనే పారిపోయాం

    షూటింగ్ మధ్యలోనే పారిపోయాం

    ఇక కోవిడ్ ఫస్ట్ వేవ్ లోనే నారప్ప షూటింగ్ భయపడుతూ చేసినట్లు సురేష్ బాబు తెలిపారు. మొదట తమిళనాడు షూటింగ్ చేస్తున్న సమయంలో 6 కిలో మీటర్ల దూరంలో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు న్యూస్ రాగానే భయంతో అక్కడి నుంచి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని పారిపోయినట్లు చెప్పారు.

    నలుగురు చనిపోయారు

    నలుగురు చనిపోయారు

    ఇక కరోనా మొత్తంలో నారప్ప షూటింగ్ లో వర్క్ చేసిన నలుగురు చనిపోయినట్లు చెబుతూ.. ఆ ఘటనలను మనోవేదనకు గురి చేశాయాని అన్నారు. రెండు మూడు కేసులు ఉన్నప్పుడు చాలా భయంగా షూటింగ్ చేశాము. ఇక ఆ తరువాత వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పుడు పెద్దగా కంగారు లేకుండా చేశాము. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నట్లు సురేష్ బాబు వివరణ ఇచ్చారు.

    English summary
    Narappa is an upcoming Indian Telugu-language action drama film directed by Srikanth Addala. A remake of the Tamil-language film Asuran (2019) which is itself based on the novel Vekkai by Poomani, Narappa movie amazon prime release date fix.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X