Varisu Theatre Issue: థియేటర్ల గొడవ సురేష్ బాబు క్లారిటీ.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ..
దిల్ రాజు నిర్మించిన వారిసు సినిమా సంక్రాంతికి తెలుగు సినిమాలతో పాటు భారీ స్థాయిలో విడుదలవుతూ ఉండడం పై కొంతమంది నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే నిర్మాతల మండలి కూడా ఈ విషయంపై స్పందిస్తూ తెలుగు సినిమాలకు పండగ సమయంలో ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ ధియేటర్లు ఇచ్చేయాలి అని డిస్ట్రిబ్యూటర్లను కోరారు. అయితే ఈ విషయంపై ఇదివరకే నిర్మాత అల్లు అరవింద్ తన వివరణ ఇవ్వగా ఇప్పుడు మరో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాలలోకి వెళితే..

RRR, పుష్ప..
నారప్ప సినిమా రీ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన సురేష్ బాబు విజయ్ వారసుడు సినిమా థియేటర్స్ పై నెలకొన్న కాంట్రవర్సీపై ఈ విధంగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ముందుగా మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన RRR, పుష్ప బాహుబలి సినిమాలను అవతలి ఇండస్ట్రీలో ఎలా రిలీజ్ చేశారు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇలాంటి సమస్య అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇప్పటికే సినిమాలు అవధులను దాటేసాయి కొన్ని చిన్న సినిమాలు ఊహించని విధంగా సక్సెస్ అవుతాయి అని ఎవరు అనుకోలేదు అన్నారు.

ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి.
ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీని చాలా తక్కువగానే చూసారు. కానీ కాంతర సినిమా ఒక రేంజ్ లో సక్సెస్ అయింది. అదే భాష నుంచి వచ్చిన మరో పెద్ద సినిమా కేజీఎఫ్ కూడా సక్సెస్ అయింది. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వాటిని చర్చించుకుని ముందుకు వెళ్లాలి. మన హీరోల సినిమాలు కూడా తమిళంలో విడుదలైనప్పుడు మిగతా హీరోలు కూడా ఫీలయ్యారు. ఆరోజు మనం మాట్లాడలేదు.. అని సురేష్ అన్నారు.

సొల్యూషన్ రావడం అనేది కష్టం
ఎక్కడైనా సరే హీరోల సామర్థ్యాన్ని బట్టి విడుదల చేయడం జరుగుతుంది. ఒక విధంగా అవతార్ సినిమా హీరో ఎవరో మనకు తెలియదు. కానీ మనం అన్ని థియేటర్లలో రిలీజ్ చేసాము. కొన్ని బాధలు ఉండవచ్చు ముఖ్యంగా నిర్మాతలకు వారి సినిమా ఎక్కువ థియేటర్లు విడుదలవుతే బాగుంటుంది అని బాధ కూడా ఉంటుంది. కానీ దానికి సొల్యూషన్ రావడం అనేది కష్టం.. తెలిపారు.

మంచి కంటెంట్ ఉన్న సినిమాలు..
ఎప్పుడైనా సరే పెద్ద సినిమాలు పండుగ సమయంలో వచ్చినప్పుడు అక్కడ భాషలో కూడా విడుదల చేస్తూ ఉండవచ్చు. మహేష్ బాబు రాజమౌళి సినిమా వచ్చే సంక్రాంతికి తమిళంలో కూడా భారీగా రిలీజ్ కావచ్చు. ఎవరైతే పెద్ద సినిమాలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా వాటికి బిజినెస్ పెరుగుతుంది. అవే రేంజ్ కు తగ్గట్టుగా రిలీజ్ అవుతాయి. మన సినిమాలను అవతలి ఇండస్ట్రీలో చులకనగా చూస్తున్నారు అనడం కరెక్ట్ కాదు. పుష్ప RRR సినిమా లాంటివి ఆడినవి కదా. సినిమాలను ఎవరు చులకనగా చూడలేరు.. అని తెలిపారు.

టెన్షన్ పడాల్సిన అవసరం లేదు
ఫైనల్ గా ఏ భాష నుంచి వచ్చిన సరే కంటెంట్ అనేది చాలా ముఖ్యం. కాంతారా అనేది చాలా చిన్న సినిమా అందరిని షాక్ చేసింది. అప్పట్లో అరుంధతి సినిమాలో కూడా తమిళంలో రిలీజ్ చేశారు. శివ కూడా అక్కడ రిలీజ్ చేశారు. బాగానే ఆడింది. కంటెంట్ ను బట్టి ఎక్కడైనా సరే ఆడియన్స్ సినిమాలను చూస్తారు. ఏదైనా సరే ఇలాంటి గొడవలు అనేవి వార్తల్లో రాసుకోవడానికి మాత్రమే ఉంటాయి. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు.. అని సురేష్ బాబు తన వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











