నిర్మాత సురేష్ బాబుకు టోకరా.. తక్కువ ఖర్చుతో టీకాలు ఇప్పిస్తానని మోసం.. డబ్బు పంపగానే న్యూ ట్విస్ట్
కరోనా వైరస్ కారణంగా రోజుకు వేలాది మంది ప్రాణాలు. కోల్పోతున్నారు. ఎంతోమంది జీవితాలు ఆర్థికంగా మానసికంగా దెబ్బ తింటున్నాయి. ఈ కఠిన సమయంలో కొంతమంది పరిస్థితిని ఆసరాగా చేసుకొని డబ్బులు కాజేస్తున్నారు. సాదారణ ప్రజలతో పాటు ఎంతోమంది ధనవంతులు కూడా మోసపోతున్నారు. ఇక రీసెంట్ టాలీవుడ్ సీనియర్ నిర్మాత సురేష్ బాబుకు కూడా ఒక వ్యక్తి టోకరా వేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఎంతో జాగ్రత్తగా ఉండే సురేష్ బాబు..
నిర్మాత సురేష్ బాబు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని ఆయన సినిమాల నిర్మాణం చూస్తేనే అర్ధమవుతుంది. వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ రూపాయి కూడా వృధా కాకూడదని అనుకునే మనిషి. ఎవరు ఎలాంటి వారో కూడా మాట్లాడిన నాలుగు మాటల్లోనే పసిగట్టేస్తారు. అందుకే సురేష్ బాబు అంటే స్టార్ దర్శకులు కూడా ప్రత్యేకంగా గౌరవిస్తుంటారు.

500 టీకాలు ఇస్తానని చెప్పి
సురేష్ బాబు అంత ఈజీగా ఎవరని నమ్మరని తెలుసు. అలాంటి నిర్మాతను ఒక సాధారణ వ్యక్తి మాయమాటలతో డబ్బు కాజేయడం హాట్ టాపిక్ గా మారింది. కోవిడ్ కష్టకాలంలో వివిధ రకాల రేట్లతో టీకాలను అమ్ముతున్న విధానం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే సురేష్ బాబుకు కూడా ఒక వ్యక్తి 500 టీకాలు పంపిస్తానని చెప్పి డబ్బు తీసుకొని జంప్ అయ్యాడు.

డబ్బు పంపిన నిర్ణత
వివరాల్లోకి వెళితే.. ఇటీవల నాగార్జున రెడ్డి అనే ఒక వ్యక్తి సురేష్ బాబుకు ఫోన్ చేసి తన దగ్గర 500 డోసుల టీకాలు ఉన్నాయని చెప్పాడు. అయితే ముందుగానే లక్ష రూపాయలు తన భార్య బ్యాంక్ ఖాతాకు పంపాలని కండిషన్ పెట్టడంతో సురేష్ బాబు పెద్దగా ఆలోచించకుండా డబ్బు పంపాడు.
Recommended Video

ట్విస్ట్ ఇచ్చిన మాయగడు
ఇక నాగార్జున రెడ్డి డబ్బు అందిన వెంటనే మళ్ళీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ చేసి సురేష్ బాబుకు ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న సురేష్ బాబు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇక ఆలస్యం చేయకుండా పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.


Click it and Unblock the Notifications











