నాకు ఎగ్గొట్టినంత డబ్బు ఇండస్ట్రీలో ఎవరికి ఎగ్గొట్టలేదు.. కోపం వస్తే అదే చేస్తా: నిర్మాత సురేష్ బాబు

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పై పట్టు ఉన్న అతికొద్ది మంది క్రియేటివ్ నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా డీలింగ్స్ సెట్ చేసుకుంటారు. పెద్ద సినిమాలతో కాకుండా ఎక్కువగా చిన్న సినిమాలతోనే ప్రయోగాలు చేస్తుంటారు. వస్తే కొండ పోతే వెంట్రుక అనేలా ఆలోచిస్తుంటారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ బాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

కొత్తవారికి కూడా అవకాశాలు

కొత్తవారికి కూడా అవకాశాలు

కేవలం నిర్మాతగానే కాకుండా ఇండస్ట్రీ పెద్దగా మంచి చెడ్డలో తోడుగా ఉండే అతికొద్ది మందిలో సురేష్ బాబు ఒకరు. నిర్మాత డి. రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. ఇక కొత్తవారికి కూడా అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటారు. యువతకు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంటారు.

టికెట్ల రేట్లు.. మహా దారుణంగా

టికెట్ల రేట్లు.. మహా దారుణంగా

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో టికెట్ల రేట్ల విషయంలో కూడా ఆయన అందరి తరపున రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు మరీ దారుణంగా ఉన్నాయని ఒక మీడియం రేంజ్ ధరలను కేటాయించాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు వివరణ ఇచ్చారు.

Recommended Video

Producer Kalaipuli S Dhanu About Narappa Movie | Filmibeat Telugu
చాలామంది డబ్బులు ఇవ్వాలి

చాలామంది డబ్బులు ఇవ్వాలి

ఇక నిర్మాత సురేష్ బాబు ప్రతి రూపాయి విషయంలో చాలా కఠినంగా ఉంటారని చాలా కామెంట్స్ వస్తుంటాయి. ఇక ఆ విషయంపై స్పందించిన ఆయన ఇండస్ట్రీలో చాలామంది తనకు డబ్బులు ఇవ్వాలని కాస్త అసహనంగానే చెప్పేశారు. సినిమాలు నిర్మిస్తామని, డిస్ట్రిబ్యూషన్ కోసమని, పర్సనల్ ఫైనాన్స్ కోసమని మరికొందరు ఇలా తన వద్ద చాలా డబ్బు తీసుకున్నట్లు చెప్పారు.

నాకు కోపం వచ్చేది అందుకే

నాకు కోపం వచ్చేది అందుకే

ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా ఆ లిస్టులో ఉన్నట్లు తెలిపారు. ఇక కోపం వచ్చింది అంటే లిస్టు మొత్తం బయటపెడతానని కూడా అన్నారు. అయితే ఎప్పుడు కూడా తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అంటూ.. డబ్బు తీసుకున్న ప్రతి ఒక్కరి డాక్యుమెంటేషన్ తన వద్ద ఉందని అన్నారు.

ఇక తీసుకున్నవాళ్ళు నష్టాల్లో ఉంటే నేను అడగను. అడిగినా కూడా ఉపయోగం లేదు. కానీ డబ్బు ఉండి కూడా అప్పు తిరిగి ఇవ్వకపోతే నాకు కోపం వస్తుంది.. అని సురేష్ బాబు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X